ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో రెండు రోజుల్లో రిమార్కబుల్ రికవరీని సొంతం చేసుకున్న టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1 3 Days Gross Collections) తెలుగు రాష్ట్రాల్లో ఎక్స్ లెంట్ గా జోరు చూపించి 108.40 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుని మాస్ రచ్చ చేసిన దేవర మూవీ….వరల్డ్ వైడ్ గా కూడా దుమ్ము లేపిన సినిమా…
211 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని రచ్చ లేపిన సినిమా మూడో రోజు ఎక్స్ లెంట్ గా అన్ని చోట్లా మాస్ రచ్చ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఇప్పుడు 27-28 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా….
ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే గ్రాస్ ఇంకాస్త పెరిగే అవకాశం ఉంది…ఇక సినిమా హిందీలో ఈ రోజు 13 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా కర్ణాటకలో మరోసారి 5 కోట్ల మార్క్ ని దాటే అవకాశం కనిపిస్తుంది…
ఇక తమిళనాడు, కేరళ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో ఓవరాల్ గా 2.25-2.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉంది…దాంతో ఇండియాలో సినిమా 3వ రోజు ఓవరాల్ గా ఇప్పుడు 47-48 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది.
ఇక ఓవర్సీస్ లో మరోసారి దుమ్ము లేపుతున్న సినిమా 6 కోట్లకు అటూ ఇటూగా గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా 3వ రోజు ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే 53-55 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అటూ ఇటూగా అందుకునే అవకాశం ఉండగా…
ఈ కలెక్షన్స్ తో తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా మూడు రోజుల్లో 136 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ని అందుకునే అవకాశం మించి పోయే ఛాన్స్ ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా 265-266 కోట్ల రేంజ్ లో దుమ్ము లేపే గ్రాస్ ను సాధించవచ్చు. ఇక అఫీషియల్ 3 డేస్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.