బాక్స్ ఆఫీస్ దగ్గర మలయాళంలో మంచి విజయాన్ని సొంతం చేసుకుని కుమ్మేసిన జింఖానా(Gymkhana Telugu Movie) తెలుగులో రీసెంట్ గా డబ్ అవ్వగా మంచి కలెక్షన్స్ తో వీకెండ్ ని కంప్లీట్ చేసుకుంది. సండే రోజున మరీ అనుకున్న రేంజ్ లో జోరు చూపించ లేదు కానీ ఉన్నంతలో సినిమా….
మంచి జోరునే చూపించి మిగిలిన కొత్త సినిమాల కన్నా కూడా బెటర్ ట్రెండ్ ను చూపించింది… మొత్తం మీద సినిమా మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో 55 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని ఎక్స్ లెంట్ గానే దుమ్ము లేపడం విశేషం కాగా ఓవరాల్ గా మూడో రోజున…
తెలుగు రాష్ట్రాల్లో 1.15 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకున్నట్లు అంచనా…ఓవరాల్ గా మిగిలిన సినిమాల కన్నా కూడా బెటర్ గానే ట్రెండ్ ను చూపిస్తున్న జింఖానా సినిమా ఇప్పుడు ఓవరాల్ గా 3 రోజులు పూర్తి అయ్యే టైంకి సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Alappuzha Gymkhana Movie Telugu 3 Days Collections Report
👉Nizam: 0.80Cr~
👉Total AP: 0.95Cr~
AP-TG Total:- 1.75CR(3.50Cr~ Gross)
ఇదీ మొత్తం మీద సినిమా వీకెండ్ లో సాధించిన కలెక్షన్స్ లెక్క…
ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు లో డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే 3.25 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది…. సినిమా వీకెండ్ లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 1.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. వర్కింగ్ డేస్ లో మినిమమ్ హోల్డ్ చూపించినా సినిమా విజయాన్ని అందుకోవడం ఖాయమని చెప్పాలి…