బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్(Akshay Kumar)నటించిన హౌస్ ఫుల్ 5(HouseFull5 Movie) మూవీ గ్రాండ్ గా రిలీజ్ అవ్వగా పర్వాలేదు అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న సినిమా వీకెండ్ లో ఓవరాల్ గా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేస్తూ దుమ్ము దుమారం లేపింది…
సినిమా రెండు రోజుల్లో ఓవరాల్ గా 56.73 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమా రీసెంట్ టైంలో అక్షయ్ కుమార్ ఫామ్ దృశ్యా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేయగా మూడో రోజు సండే అడ్వాంటేజ్ తో అనుకున్న అంచనాలను అన్నీ కూడా…
మించి పోయి ఊహకందని జోరుని చూపించింది… మూడో రోజు అక్షయ్ కుమార్ కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ అనిపించే రేంజ్ లో వసూళ్ళని సొంతం చేసుకున్న హౌస్ ఫుల్ 5 మూవీ ఓవరాల్ గా 35.10 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని సొంతం చేసుకుని ఊచకోత కోసింది.
ఓవరాల్ గా మూడు రోజుల వీకెండ్ లో సినిమా ఇండియాలో ఏకంగా 91.83 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుని సెన్సేషన్ ని క్రియేట్ చేయగా రీసెంట్ టైంలో అక్షయ్ కుమార్ కెరీర్ లోనే ది బెస్ట్ అనిపించే రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోగా…
వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టిన సినిమా ఇప్పుడు 4వ రోజున ఓవరాల్ గా 12-14 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా లాంగ్ రన్ లో హౌస్ ఫుల్5 మూవీ 200 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని అవలీలగా అందుకునే అవకాశం ఉందని అంటున్నారు ఇప్పుడు.