ఈ వీక్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన కొత్త సినిమాలు మంచి జోరునే చూపించాయి…అదే టైంలో ఎప్పుడో 30 ఏళ్ల క్రితం రిలీజ్ అయ్యి సంచలన విజయం నమోదు చేసిన మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) నటించిన బ్లాక్ బస్టర్ మూవీ జగదేకవీరుడు అతిలోకసుందరి(Jagadeka Veerudu Athiloka Sundari) సినిమా ఇప్పుడు మళ్ళీ రీ రిలీజ్ అవ్వగా…
ఆడియన్స్ నుండి ఈ సినిమాకి కూడా సాలిడ్ రెస్పాన్స్ సొంతం అయ్యింది అని చెప్పాలి. మొదటి 2 రోజుల్లో ఓవరాల్ గా 46.5 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని కుమ్మేసిన ఈ సినిమా మూడో రోజు సండే అయినా కూడా మరోసారి…
మంచి హోల్డ్ ని చూపించి 8.5 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ ను అందుకోగా…టోటల్ గా 3 రోజుల్లో ఇక్కడ 55 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ ను సాధించింది. ఇక నార్త్ అమెరికాలో సినిమా ఆల్ మోస్ట్ 45 వేల రేంజ్ లో డాలర్స్ మార్క్ ని అందుకుని కుమ్మేసింది..
ఇక మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి మంచి హోల్డ్ నే చూపెడుతూ సినిమా 28 లక్షల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని అందుకోగా టోటల్ గా ఇప్పటి వరకు సినిమా వీకెండ్ లో సాధించిన కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే…
Jagadeka Veerudu Athiloka Sundari 3 Days Re Release WW Collections(est)
👉Nizam: 82L~
👉Ceeded: 24L~
👉Andhra: 90L~
AP-TG Total:- 1.96CR~ Gross
👉KA+ROI+OS : 44L****approx.
Total WW Collections: 2.40CR Gross
మొత్తం మీద వరల్డ్ వైడ్ గా వీకెండ్ లో 2.4 కోట్ల రేంజ్ లో వసూళ్ళని అందుకున్న సినిమా ఎక్స్ లెంట్ గా జోరుని చూపించి కుమ్మేసింది… పోటిలో కొత్త సినిమాలు కుమ్మేసినా కూడా మెగాస్టార్ మరోసారి తన మాస్ పవర్ ను చూపించి రచ్చ లేపాడు…