Home న్యూస్ యునానిమస్ రివ్యూలు…అయినా కేసరి2 3 రోజుల కలెక్షన్స్ ఇవే!!

యునానిమస్ రివ్యూలు…అయినా కేసరి2 3 రోజుల కలెక్షన్స్ ఇవే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ టైంలో పెద్దగా ఫామ్ లో లేని బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్(Akshay Kumar) నటించిన లేటెస్ట్ మూవీ కేసరి చాప్టర్2(Kesari Chapter 2 Movie) రీసెంట్ గా రిలీజ్ అయ్యి రీసెంట్ టైంలోనే ఎక్స్ లెంట్ రివ్యూలను సొంతం చేసుకున్న అతి కొద్ది సినిమాల్లో ఒకటిగా నిలిచి కుమ్మేసింది….

దాంతో కలెక్షన్స్ పరంగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ జోరుని చూపెడుతుంది అనుకున్నా కూడా కలెక్షన్స్ పరంగా మాత్రం సినిమా మొదటి వీకెండ్ లో పెద్దగా ఇంపాక్ట్ ని ఏమి చూపించ లేక పోయింది ఇప్పుడు…ఈ రేంజ్ రివ్యూలు సొంతం అయిన సినిమాకి…

కలెక్షన్స్ సాలిడ్ గా వస్తాయి అనుకున్నా ఏ రోజు కూడా అంచనాలను మించి పోలేక పోయింది సినిమా…ఫస్ట్ డే 7.8 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకోగా రెండో రోజు 10 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ ని అందుకోగా మూడో రోజు సినిమా సండే అడ్వాంటేజ్ తో…

సాలిడ్ గ్రోత్ ని చూపెడుతుంది అనుకోగా 14-15 కోట్ల రేంజ్ నెట్ కలెక్షన్స్ ని అందుకుంటుంది అనుకున్నా కూడా ఓవరాల్ గా 11.7 కోట్ల రేంజ్ లోనే నెట్ కలెక్షన్స్ మార్క్ ని సొంతం చేసుకుని అండర్ పెర్ఫార్మ్ చేసింది సినిమా…

దాంతో టోటల్ గా సినిమా 3 రోజుల్లో 29.6 కోట్ల రేంజ్ లోనే నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుని ఆశించిన ఇంపాక్ట్ ను చూపించలేదు…సినిమాకి వచ్చిన టాక్ కి వీకెండ్ లో మినిమమ్ 45-50 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకుని ఉండాల్సింది. ఇక వర్కింగ్ డేస్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here