Home న్యూస్ కింగ్ స్టన్ మూవీ వీకెండ్ కలెక్షన్స్…..చుక్కలు కనిపించాయిగా!!

కింగ్ స్టన్ మూవీ వీకెండ్ కలెక్షన్స్…..చుక్కలు కనిపించాయిగా!!

0

జి.వి.ప్రకాష్ కుమార్(GV Prakash Kumar) కెరీర్ లో హీరోగా నటించిన 25వ సినిమా అయిన కింగ్ స్టన్(Kingston Movie) రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఇండియన్ మూవీస్ లో ఇప్పటి వరకు రాని పాయింట్ తో ఈ సినిమాను భారీ ఎత్తున రూపొందించగా….తమిళ్ తో పాటు తెలుగు లో రిలీజ్ అయిన ఈ సినిమాకి…

మొదటి ఆటకే మిక్సుడ్ రెస్పాన్స్ సొంతం అవ్వగా ఓపెనింగ్స్ పరంగా పెద్దగా ఇంపాక్ట్ అయితే ఏమి కనిపించలేదు వీకెండ్ లో…తెలుగు రాష్ట్రాల్లో సినిమా మొదటి రోజు 25 లక్షల రేంజ్ లో గ్రాస్ తో ఓపెన్ అయిన సినిమా రెండో రోజు 30 లక్షలు మూడో రోజు మొత్తం మీద 20 లక్షల…

రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా వీకెండ్ లో ఓవరాల్ గా 75 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా షేర్ 30 లక్షల లోపే ఉండగా తెలుగు లో డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే 2.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉండగా సినిమా ఆ టార్గెట్ కి చాలా దూరంలో ఆగిపోబోతుంది.

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తమిళనాడులో ఓవరాల్ గా వీకెండ్ లో 3 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లో మరో కోటి రేంజ్ లోనే గ్రాస్ ను సొంతం చేసుకున్న సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇవరాల్ గా…

4.75 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకుని తీవ్రంగా నిరాశ పరిచింది ఇప్పుడు. వర్త్ షేర్ ఓవరాల్ గా 2.2 కోట్ల రేంజ్ లో ఉండే అవకాశం ఉండగా…వరల్డ్ వైడ్ గా సినిమా డీసెంట్ హిట్ అవ్వాలి అంటే 20 కోట్ల దాకా అయినా షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. కానీ సినిమా వీకెండ్ కే చుక్కలు కనిపించాయి అని చెప్పాలి బాక్స్ ఆఫీస్ దగ్గర…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here