బాక్స్ ఆఫీస్ దగ్గర తమిళ్ లో సంక్రాంతి కానుకగా ఎప్పుడో 12 ఏళ్ల క్రితం రిలీజ్ అవ్వాల్సిన విశాల్(Vishal) నటించిన ఓల్డ్ మూవీ మద గజ రాజ(Madha Gaja Raja) మూవీ ఈ సంక్రాంతికి అక్కడ రిలీజ్ అయ్యి అంచనాలను మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కొత్త సినిమాల వాళ్ళ కానిది…
ఏకంగా 12 ఏళ్ల క్రితం వచ్చిన మూవీ తో కెరీర్ లో ఏకంగా సెకెండ్ హైయెస్ట్ గ్రాస్ ను తమిళనాడులో ఈ సినిమాతో సొంతం చేసుకున్న మాస్ రచ్చ చేసి 50 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ని దాటేసిన సినిమా రీసెంట్ గా తెలుగు లో డబ్ అయ్యి వీకెండ్ లో రిలీజ్ అవ్వగా…
ఇక్కడ కూడా తమిళ్ లో రేంజ్ లో జోరు చూపెడుతుంది అనుకున్నా కూడా అలాంటిది ఏమి జరగలేదు. తెలుగు లో 2 రోజుల్లో ఓవరాల్ గా 75 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకున్న సినిమా మూడో రోజు సండే అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ ఓవరాల్ గా…
30 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకున్న సినిమా ఓవరాల్ గా వీకెండ్ లో తెలుగు రాష్ట్రాల్లో 1.05 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా షేర్ 50 లక్షల రేంజ్ కి అటూ ఇటూగా ఉంటుందని అంచనా… ఇక తెలుగు రాష్ట్రాల్లో సినిమా డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే…
2.20 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా సినిమా ఇక్కడ నిరాశ పరిచే రిజల్ట్ నే సొంతం చేసుకోబోతుంది. ఇక వరల్డ్ వైడ్ గా ఆల్ మోస్ట్ 55 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ తో సినిమా అంచనాలను మించి సూపర్ సక్సెస్ గా నిలిచింది…