బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ 2 రోజులు పూర్తి అయ్యే టైంకి రెండు తెలుగు రాష్ట్రాల్లో 126.65 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని వరల్డ్ వైడ్ గా రికార్డ్ లెవల్ లో 425 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప2(Pushpa 2 The Rule) సినిమా ఊచకోత కోయగా…
సినిమా మూడో రోజు అన్ని చోట్లా ఎక్స్ లెంట్ ట్రెండ్ ను చూపించి మరోసారి మాస రచ్చ చేసింది ఇప్పుడు…తెలుగు రాష్ట్రాల నుండే సినిమా అటూ ఇటూటా 30-31 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుని దుమ్ము లేపగా ఫైనల్ లెక్కలు బాగుంటే గ్రాస్ మరింత పెరిగే అవకాశం ఉంది…
ఇక హిందీ లో మాత్రం సినిమా రికార్డుల భీభత్సం సృష్టిస్తూ అవలీలగా 75 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉంది….ఇక తమిళనాడులో 10 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను కర్ణాటకలో 10-11 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను కేరళలో 2.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా…
టోటల్ గా ఇండియాలోనే సినిమా ఇప్పుడు ఓవరాల్ గా 125-130 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ను అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఓవర్సీస్ లో 2.8-3 మిలియన్ డాలర్స్ రేంజ్ లో మరోసారి వసూళ్ళని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఈ ఓవరాల్ గా ఇప్పుడు మూడో రోజున…
వరల్డ్ వైడ్ గా సినిమా 145-150 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు కనుక రెండో రోజు లెవల్ లో అంచనాలను మించిపోతే ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు. ఈ కలెక్షన్స్ తో సినిమా ఓవరాల్ గా ఇప్పుడు….
మూడు రోజులు పూర్తి అయ్యే టైంకి తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 158 కోట్లకు అటూ ఇటూగా గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా ఆల్ టైం రికార్డ్ లెవల్ లో 570-575 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉంది. ఇక సినిమా ఓవరాల్ గా 3 రోజులకు గాను సాధించే అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.