బాక్స్ ఆఫీస్ దగ్గర యూత్ స్టార్ నితిన్(Nithiin) నటించిన లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్(RobinHood Movie) సినిమాతో మంచి కంబ్యాక్ ను సొంతం చేసుకుంటాడు అని ఎక్స్ పెర్ట్ చేసినా కూడా సినిమా కి అనుకున్న రేంజ్ లో టాక్ అయితే ఆడియన్స్ నుండి రాలేదు. దాంతో కలెక్షన్స్ పరంగా సినిమా మినిమమ్ హోల్డ్ ని కూడా…
బాక్స్ ఆఫీస్ దగ్గర చూపించ లేక చేతులు ఎత్తేసింది. మూడో రోజు ఉగాది పండగ హాలిడే అడ్వాంటేజ్ లభించినా కూడా పెద్దగా ఇంపాక్ట్ ను ఏమి చూపించలేక పోయిన సినిమా బిలో పార్ కలెక్షన్స్ నే సొంతం చేసుకుని క్లీన్ హిట్ కోసం ఇంకా చాలా కష్టపడాల్సిన అవసరం ఉంది.
మొత్తం మీద మూడో రోజు సినిమా 1.5 కోట్ల రేంజ్ దాకా అయినా షేర్ ని అందుకోవచ్చు అనుకున్నా కూడా 1.27 కోట్ల రేంజ్ లోనే షేర్ ని సొంతం చేసుకుంది బాక్స్ ఆఫీస్ దగ్గర…వరల్డ్ వైడ్ గా సినిమా 1.37 కోట్ల రేంజ్ లో షేర్ 2.7 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా…
టోటల్ గా మూడు రోజులు పూర్తి అయ్యే టైంకి టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Robin Hood 3 Days WW Collections Report(Inc GST)
👉Nizam: 1.75Cr~
👉Ceeded: 55L~
👉Andhra: 1.80Cr~
AP-TG Total:- 4.10CR(7.80CR~ Gross)
👉KA+ROI: 32L~
👉OS: 70L~
Total WW Collections – 5.12CR(10.25CR~ Gross)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 28.50 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా మూడు రోజులు పూర్తి అయ్యే టైంకి ఓవరాల్ గా సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 23.38 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక 4వ రోజున సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.