Home న్యూస్ శబ్దం మూవీ వీకెండ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్!!

శబ్దం మూవీ వీకెండ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్!!

0

అప్పట్లో వైశాలి సినిమాతో మంచి రిజల్ట్ ను సొంతం చేసుకున్న ఆది పినిశెట్టి మళ్ళీ అదే కాంబోలో చేసిన లేటెస్ట్ మూవీ శబ్దం(Sabdham Movie) ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమాకి ఆడియన్స్ నుండి పర్వాలేదు…సౌండింగ్ బాగుంది లాంటి రెస్పాన్స్ వచ్చినా కూడా కలెక్షన్స్ పరంగా మాత్రం….

పెద్దగా ఇంపాక్ట్ అయితే ఏమి కనిపించలేదు బాక్స్ ఆఫీస్ దగ్గర….మొదటి రోజున సినిమా తెలుగు రాష్ట్రాల్లో 50 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకున్న సినిమా ఇండియా మొత్తం మీద 65 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. ఇక రెండో రోజున సినిమా తెలుగు రాష్ట్రాల్లో…

40 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకున్న సినిమా తమిళ్ లో 70 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది…ఇక మూడో రోజు సండే అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ తెలుగు లో 40 లక్షల రేంజ్ లోనే గ్రాస్ ను అందుకోగా తమిళ్ లో 75 లక్షల రేంజ్ లోనే గ్రాస్ ను అందుకోగా…

టోటల్ గా 3 రోజుల వీకెండ్ పూర్తి అయ్యే టైంకి తెలుగులో సినిమా 1.30 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా 60 లక్షల రేంజ్ లో షేర్ ని సాధించింది సినిమా…ఇక తెలుగు వాల్యూ బిజినెస్ రేంజ్ 2 కోట్ల రేంజ్ లో ఉంటుందని అంచనా…సినిమా 2.2 కోట్ల రేంజ్ లో షేర్ ని…

సాధించాల్సిన అవసరం ఉండగా మరో 1.60 కోట్ల షేర్ ని సాధించాల్సి ఉంటుంది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా 3.30 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా 1.6 కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించినట్లు అంచనా….సినిమా వరల్డ్ వైడ్ బిజినెస్ లెక్కలు క్లియర్ గా లేవు కానీ…

ఓవరాల్ గా 11-12 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటే డీసెంట్ హిట్ అని చెప్పొచ్చు. ఇక మొత్తం మీద వీకెండ్ ని బిలో పార్ కలెక్షన్స్ తో పూర్తి చేసుకుని వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టిన సినిమా లాంగ్ రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here