Home న్యూస్ 150వ సినిమా…3 రోజుల్లో వచ్చింది ఇది…హిట్ టాక్ తో షాకిచ్చే రిజల్ట్!!

150వ సినిమా…3 రోజుల్లో వచ్చింది ఇది…హిట్ టాక్ తో షాకిచ్చే రిజల్ట్!!

0

బాలీవుడ్ ఖిలాడి అక్షయ్ కుమార్(Akshay Kumar) నటించిన రీసెంట్ మూవీస్ ఏవి కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న రేంజ్ లో పెర్ఫార్మ్ చేయడం లేదు…కోవిడ్ ముందు కెరీర్ బెస్ట్ ఫామ్ లో ఉన్న అక్షయ్ కోవిడ్ తర్వాత నాసిరకం సినిమాలు చేస్తూ వరుస పెట్టి నిరాశ పరిచే రిజల్ట్ లను సొంతం చేసుకుంటూ ఉండగా ఇప్పుడు తన కెరీర్ లోనే ప్రతిష్టాత్మక 150 వ సినిమాగా…

తెరకెక్కిన లేటెస్ట్ మూవీ సర్ ఫిరా(Sarfira Movie) రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోగా…ఇక అక్షయ్ కుమార్ కెరీర్ లో మంచి కంబ్యాక్ ను సొంతం చేసుకుంటుంది అనుకున్నా కూడా టాక్ బాగున్నా కూడా కలెక్షన్స్ పరంగా మాత్రం సినిమా ఏ దశలో కూడా అంచనాలను అందుకోలేక పోతుంది ఇప్పుడు…

ఆల్ రెడీ ఓటిటి లో సూపర్ హిట్ అయిన ఆకాశం నీ హద్దు రా సినిమా ను చూడటంతో రీమేక్ ని బాలీవుడ్ ఆడియన్స్ పెద్దగా చూడటానికి థియేటర్స్ కి రావడం లేదు…మొత్తం మీద మొదటి రోజు 2.5 కోట్లు, రెండో రోజు 4.5 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోగా మూడో రోజు సినిమా 5.50 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకున్న సినిమా…

మొదటి వీకెండ్ లో టోటల్ గా ఇండియాలో 12.50 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని మాత్రమే సొంతం చేసుకుని తీవ్రంగా నిరాశ పరిచింది ఇప్పుడు. టాక్ బాగున్నా కూడా జనాలు అక్షయ్ కుమార్ సినిమాను చూడటానికి పెద్దగా థియేటర్స్ కి రాక పోవడంతో  టాక్ పాజిటివ్ గా ఉన్నా కూడా కలెక్షన్స్ పెద్దగా గ్రోత్ చూపించడం లేదు…

కెరీర్ లో 150వ సినిమాగా తెరకెక్కిన సినిమాకి హిట్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ పరంగా ఏమాత్రం ఇంపాక్ట్ చూపించక పోవడంతో బాలీవుడ్ కూడా ఈ సినిమాతో బాలీవుడ్ కి మంచి హిట్ వస్తుంది అనుకున్నా కూడా మైండ్ బ్లాంక్ చేసే రిజల్ట్ ను సొంతం చేసుకోబోతుంది ఇప్పుడు. వర్కింగ్ డేస్ లో ఏమైనా హోల్డ్ చూపించకపొతే మాత్రం భారీ నిరాశని మిగిలించడం ఖాయంగా కనిపిస్తుంది ఇప్పుడు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here