బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి 2 రోజుల్లో మంచి కలెక్షన్స్ నే సొంతం చేసుకున్నా కూడా అందులో ఓవర్సీస్ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలెక్షన్స్ హెల్ప్ ఎక్కువగా ఉండగా తెలుగు రాష్ట్రాల్లో కొంచం అండర్ పెర్ఫార్మ్ చేసిన నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం (SARIPODHAA SANIVAARAM Movie Box Office Collections) సినిమా…
మూడో రోజు శివ తాండవం ఆడింది….వర్షాలు ఎదురుదెబ్బ తీసినా కూడా రెండో రోజు కి మించి బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ జోరుని చూపించింది… అన్ని చోట్లా మొదటి రోజుకి దగ్గర అయ్యే రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది ఈ సినిమా…
ఓవరాల్ గా 3వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 4 కోట్ల రేంజ్ దాకా షేర్ రాబట్టడం ఖాయం అనుకుంటే ఆ మార్క్ ని కూడా దాటేసిన సినిమా ఏకంగా 4.68 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేయగా వరల్డ్ వైడ్ అంచనాలను మించి పోయిన సినిమా…
ఏకంగా 6 కోట్లు ఆ పైన రావడం ఖాయం అనుకుంటే కర్ణాటక, తమిళ్ అండ్ అమెరికాలో అంచనాలను అన్నీ మించి పోయే రేంజ్ లో హోల్డ్ చేసి ఏకంగా 7.9 కోట్లకు పైగా షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది. దాంతో టోటల్ గా సినిమా 3 రోజుల్లో ఇప్పుడు సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Saripodhaa Sanivaaram Movie 3 Days Total WW Collections(Inc GST)
👉Nizam: 6.74Cr
👉Ceeded: 1.83Cr
👉UA: 1.64Cr
👉East: 64L
👉West: 61L
👉Guntur: 78L
👉Krishna: 84L
👉Nellore: 52L
AP-TG Total:- 13.60CR(21.65CR~ Gross)
👉Ka+Tamil+ROI: 3.55Cr
👉OS: 7.55Cr***
Total WW Collections:- 24.70CR(45.15CR~ Gross)
(58%~ Recovery)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 42 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 17.30 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటే క్లీన్ హిట్ అవుతుంది. ఇక ఆదివారం రోజున మరోసారి అన్ని చోట్లా సినిమా మాస్ రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉంది.