బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ రంజాన్ కానుకగా ఆడియన్స్ ముందుకు బాలీవుడ్ సూపర్ స్టార్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్(Salman Khan) నటించిన లేటెస్ట్ మూవీ సికందర్(Sikandar Movie) రిలీజ్ అవ్వగా సినిమా కి మిక్సుడ్ రెస్పాన్స్ సొంతం అవ్వగా కలెక్షన్స్ పరంగా మరీ అద్బుతం కాదు కానీ ఉన్నంతలో పర్వాలేదు అనిపించేలా…
హోల్డ్ చేస్తున్న సికందర్ మూవీ ఓవరాల్ గా ఓకే అనిపించేలా ట్రెండ్ ను కొనసాగిస్తూ ఉండగా మొదటి రోజు సినిమా 30 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోగా రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర రంజాన్ పండగ అడ్వాంటేజ్ తో 33 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని…
సొంతం చేసుకున్న సినిమా రెండు రోజుల్లో 63 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకుంది. ఇక మూడో రోజు వర్కింగ్ డే లో ఓవరాల్ గా పర్వాలేదు అనిపిస్తూ 21 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ మార్క్ ని సొంతం చేసుకున్న సినిమా ఓవరాల్ గా 3 రోజులు పూర్తి అయ్యే టైంకి…
84 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని సొంతం చేసుకున్న సినిమా ఉన్నంతలో మిక్సుడ్ టాక్ తో పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేస్తున్న సినిమా 4వ రోజున ఇప్పుడు మళ్ళీ వర్కింగ్ డే లో ఉండగా ఓవరాల్ గా సినిమా ఈ రోజు సాధించే కలెక్షన్స్ తో…
ఇండియాలో 100 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని సొంతం చేసుకోబోతుంది. మిక్సుడ్ టాక్ తో కూడా మరోసారి సల్మాన్ ఖాన్ బాక్స్ ఆఫీస్ దగ్గర తన మ్యాజిక్ ను చూపెడుతున్నా కూడా అది తన స్టార్ డం రేంజ్ లో అయితే లేదని చెప్పాలి. ఇక లాంగ్ రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.