బాక్స్ ఆఫీస్ దగ్గర 12 ఏళ్ల క్రితం రిలీజ్ అయ్యి మంచి విజయం సొంతం చేసుకున్న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు(Seethamma Vakitlo Sirimalle Chettu Movie) రీసెంట్ గా అన్ సీజన్ లో గ్రాండ్ రీ రిలీజ్ ను సొంతం చేసుకోగా కలెక్షన్స్ పరంగా ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేయగా….
వీకెండ్ లో అన్ని చోట్లా సాలిడ్ గా డామినేట్ చేసి జోరు చూపించింది…మొదటి రోజు సినిమా 2.9 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూళ్ళని అందుకోగా రెండో రోజు సినిమా ఓవరాల్ గా 1.20 కోట్ల రేంజ్ లో అప్ డేట్ అయిన గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకుంది…దాంతో రెండు రోజుల్లో సినిమా…
4.10 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని కుమ్మేయగా…మూడో రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర క్రికెట్ ఫైనల్ మ్యాచ్ ఇంపాక్ట్ ను చూపించినా కూడా ఓవరాల్ గా మంచి జోరుని చూపించిన 75 లక్షల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని…ఓవరాల్ గా అందుకోగా…
ఓవరాల్ గా 3 రోజుల వీకెండ్ లో టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా 4.85 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుని ఎక్స్ లెంట్ వీకెండ్ ని కంప్లీట్ చేసుకుంది. టాలీవుడ్ లో రీ రిలీజ్ మూవీస్ లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమాల్లో ఒకటిగా..
దూసుకు పోతున్న సినిమా ఇప్పుడు వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టగా లాంగ్ రన్ లో లిమిటెడ్ కలెక్షన్స్ తో మరింత గ్రాస్ ను పెంచుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు. ఓవరాల్ గా మరోసారి రీ రిలీజ్ లో మహేష్ బాబు తన మాస్ పవర్ తో ఎక్స్ లెంట్ వసూళ్ళని అన్ సీజన్ లో సొంతం చేసుకుని దుమ్ము లేపాడు.