మంచి సినిమా పడితే బాక్స్ ఆఫీస్ దగ్గర కచ్చితంగా మంచి జోరు చూపించే అవకాశం ఉన్న హీరోలలో ఒకరిగా డీసెంట్ పేరు తెచ్చుకుంటున్న యంగ్ హీరో శ్రీ విష్ణు(Sree Vishnu) నటించిన కొత్త సినిమా సింగిల్(Single Movie) మూవీతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ గా జోరు చూపెడుతూ సాలిడ్ కలెక్షన్స్ ని అందుకుంటూ ఉండగా…
మంచి రివ్యూలను సొంతం చేసుకున్న ఈ సినిమా కలెక్షన్స్ పరంగా కూడా కుమ్మేస్తూ ప్రతీ రోజూ ప్రీవియస్ డే కన్నా కూడా బెటర్ ట్రెండ్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర చూపెడుతూ దుమ్ము లేపుతుంది. ఇక సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో రోజున…
సాధించిన కలెక్షన్స్ తో ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను కంప్లీట్ చేసుకుని లాభాలను సొంతం చేసుకోవడం మొదలు పెట్టడం విశేషం అని చెప్పాలి. సినిమా వాల్యూ బ్రేక్ ఈవెన్ రేంజ్ 7 కోట్ల దాకా ఉండగా రెండు రోజుల్లోనే ఎక్స్ లెంట్ రికవరీని దక్కించుకున్న…
సినిమా మూడో రోజు సండే అడ్వాంటేజ్ తో అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని అందుకుని మాస్ రచ్చ చేయగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను దాటేసి బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలిచింది… శ్రీ విష్ణు కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న సామజవరగమన సినిమా…
మొదటి 4 రోజుల్లో వీకెండ్ లో 10 కోట్ల రేంజ్ లోనే గ్రాస్ ను అందుకుని లాంగ్ రన్ లో 34.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. ఇప్పుడు వీకెండ్ లోనే 15 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ మార్క్ ని అందుకున్న సింగిల్ మూవీ ఇదే రేంజ్ లో వర్కింగ్ డేస్ లో…
హోల్డ్ ని కొనసాగిస్తే లాంగ్ రన్ లో శ్రీ విష్ణు కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. మరి సినిమా వర్కింగ్ డేస్ లో అనుకున్న రేంజ్ లో హోల్డ్ ని ఎంతవరకు చూపిస్తుందో చూడాలి ఇప్పుడు…