బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన చియాన్ విక్రం(Chiyaan Vikram) నటించిన లేటెస్ట్ మూవీ వీర ధీర శూర(Veera Dheera Soora Part 2) సినిమా మంచి రెస్పాన్స్ నే ఆడియన్స్ నుండి సొంతం చేసుకున్నా కూడా కలెక్షన్స్ పరంగా మాత్రం అనుకున్న రేంజ్ లో ఇంపాక్ట్ ను చూపించలేదు…
సినిమా తెలుగులో కూడా పర్వాలేదు అనిపించే రెస్పాన్స్ ఉన్నా కూడా కలెక్షన్స్ పరంగా పెద్దగా ఇంపాక్ట్ ను చూపించని సినిమా మూడు రోజులు పూర్తి అయ్యే టైంకి ఓవరాల్ గా 95 లక్షల రేంజ్ లోనే గ్రాస్ ను అందుకుంది. షేర్ 45 లక్షల రేంజ్ లో ఉండగా…
తెలుగు వాల్యూ టార్గెట్ 4 కోట్లకు పైగా ఉండగా ఇక్కడ సినిమా రిజల్ట్ ఇక తేరుకునే అవకాశమే లేదని చెప్పాలి. ఇక తమిళనాడులో ఎట్టకేలకు 3వ రోజున గ్రోత్ ను చూపించిన సినిమా ఈ రోజు రేపు కూడా మంచి జోరుని చూపించే అవకాశం ఎంతైనా ఉంది.
మొత్తం మీద సినిమా 3 రోజుల్లో ఇప్పుడు టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Veera Dheera Soora Part2 3 Days Total WW Collections Report
👉Tamilnadu – 12.40Cr~
👉Telugu States- 0.95Cr~
👉KA+ROI – 1.60Cr
👉Overseas – 1.85CR ***Approx
Total WW Collections – 16.80CR(8.05CR~ Share)
మొత్తం మీద సినిమా వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 36 కోట్ల దాకా ఉండగా క్లీన్ హిట్ కోసం ఇంకా 28 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది… సినిమా టాక్ బాగున్నా కలెక్షన్స్ అనుకున్న రేంజ్ లో పుంజుకోలేదు. ఈ రోజు రేపు ఎంతవరకు గ్రోత్ ని చూపిస్తుందో చూడాలి ఇప్పుడు…