Home న్యూస్ పెద్ద సినిమాల నడుమ చిన్న సినిమా మాస్ వీరంగం!!

పెద్ద సినిమాల నడుమ చిన్న సినిమా మాస్ వీరంగం!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర 2025 ఇయర్ ఆల్ మోస్ట్ మొదటి 3 నెలలు పూర్తి కావోస్తూ ఉండగా ఈ 3 నెలల్లో రిలీజ్ అయిన సినిమాల్లో కొన్ని సినిమాలు అనుకున్న దాని కన్నా కూడా బెటర్ గా హోల్డ్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర చూపించి మంచి లాంగ్ రన్ ను సొంతం చేసుకున్నాయి. కానీ లేటెస్ట్ గా ఆడియన్స్ ముందుకు అన్ సీజన్ అయిన…

మార్చ్ లో రిలీజ్ అయ్యి ఊహకందని విజయాన్ని సొంతం చేసుకున్న నాచురల్ స్టార్ నాని(Nani) నిర్మాతగా నిర్మించిన లేటెస్ట్ మూవీ కోర్ట్(Court State Vs A Nobody Movie) సినిమా రిమార్కబుల్ హోల్డ్ తో తెలుగు రాష్ట్రాల్లో మార్చ్ నెలలో కంటిన్యూగా ప్రతీ రోజూ…

కోటికి తగ్గకుండా షేర్ మార్క్ ని 10 రోజుల పాటు సొంతం చేసుకుని మాస్ ఊచకోత కోసింది. కాగా ఈ ఇయర్ మొదటి 3 నెలల్లో వచ్చిన మూవీస్ లో నాలుగో సారి 10 రోజుల పాటు కోటికి తగ్గకుండా షేర్ ని అందుకున్న సినిమాగా నిలిచింది కోర్ట్ మూవీ….ఈ ఇయర్ లో…

ఇప్పటి వరకు వచ్చిన మూవీస్ లో సంక్రాంతికి వస్తున్నాం, గేమ్ చేంజర్ మరియు తండేల్ సినిమాలు ఇది వరకు ఈ ఫీట్ ను అందుకోగా డాకు మహారాజ్ మూవీ లిస్టులో ఎంటర్ కాలేక పోయింది. కానీ కోర్ట్ లాంటి చిన్న సినిమా ఎక్స్ లెంట్ గా కుమ్మేయడం విశేషం కాగా…

Top 10 most Liked Telugu Trailers in 24hrs

ఒకసారి ఏ సినిమా ఎన్ని రోజులు కోటికి తగ్గకుండా షేర్ ని అందుకుందో గమనిస్తే… 
AP TG 1cr Plus Continuous Share Movies 2025
👉#SankranthikiVasthunam – 20 Days
👉#GameChanger – 10 Days
👉#Thandel – 10 Days
👉#CourtStateVsNobody – 10 Days*******
👉#DaakuMaharaaj – 8 Days

ఓవరాల్ గా సంక్రాంతికి వస్తున్నాం సినిమాను ఈ ఇయర్ కొట్టడం కొంత కష్టమే అయినా కొన్ని క్రేజీ సినిమాలు అందుకునే అవకాశం అయితే ఉంది. కానీ మిగిలిన సినిమాలతో పోల్చితే కోర్ట్ లాంటి చిన్న సినిమా మిగిలిన సినిమాల మధ్య జోరు చూపించడం మాత్రం విశేషం అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here