Home న్యూస్ 3 సినిమాలు 203 కోట్లు….నైజాంలో చరిత్ర సృష్టించిన రెబల్ స్టార్!

3 సినిమాలు 203 కోట్లు….నైజాంలో చరిత్ర సృష్టించిన రెబల్ స్టార్!

0

203 కోట్లు….ఈ లెక్క చూస్తె చాలా మంది స్టార్స్ నటించిన సినిమాల లైఫ్ టైం కలెక్షన్స్ లా అనిపిస్తుంది కానీ ఈ లెక్క ఒక్క ఏడాదికి కొంచం అటూ ఇటూగా గ్యాప్ లో…ఒక్క నైజాం ఏరియాలోనే వచ్చిన షేర్ వసూళ్లు…పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) ఇండియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్టార్ కాగా….

రాధే శ్యామ్ లాంటి డిసాస్టర్ తర్వాత ప్రభాస్ నటించిన 3 సినిమాలు ఒక్క ఏడాది గ్యాప్ లోనే ఆడియన్స్ ముందుకు వచ్చాయి, మిగిలిన స్టార్స్ ఈ గ్యాప్ లో ఒక్క సినిమా రిలీజ్ కే కష్టపడితే ప్రభాస్ మాత్రం ఏకంగా 3 పాన్ ఇండియా మూవీస్ ని ఈ గ్యాప్ లో రిలీజ్ చేశాడు…

ఆ మూడు సినిమాల నైజాం ఏరియా కలెక్షన్స్ లెక్క ఏకంగా ఇప్పుడు 203 కోట్ల షేర్ మార్క్ ని దాటేసి సంచలనం సృష్టించడం విశేషం అని చెప్పాలి. లాస్ట్ ఇయర్ వచ్చిన ఆదిపురుష్(Adipurush) మూవీ నైజాం ఏరియాలో టోటల్ రన్ లో భారీ ట్రోల్స్ ని ఫేస్ చేసి కూడా…

Kalki 2898 AD [Telugu Version] Total WW Collections

39.20 కోట్ల రేంజ్ లో షేర్ ని రాబట్టి సంచలనం సృష్టించింది….ఇక ఆ తర్వాత ఇయర్ ఎండ్ టైంలో సలార్(Salaar Movie) ఆడియన్స్ ముందుకు వచ్చి టోటల్ రన్ లో నైజాంలో సంచలన కలెక్షన్స్ ని అందుకుని బాహుబలి2 కలెక్షన్స్ ని దాటేసి ఏకంగా 71.40 కోట్ల రేంజ్ లో…

షేర్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించగా…ఇప్పుడు ఈ ఇయర్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన ప్రభాస్ కల్కి(Kalki 2898 AD) మూవీ అంచనాలను మించిన భీభత్సాన్ని నైజాం ఏరియాలో సృష్టించింది…టోటల్ రన్ లో భీభత్సం సృష్టిస్తూ ఏకంగా….

92.80 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని ఆల్ టైం టాప్ 2 షేర్ ని ఇక్కడ సొంతం చేసుకుంది. మొత్తం మీద ఏడాది గ్యాప్ లోనే ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ మూడు సినిమాల టోటల్ కలెక్షన్స్ షేర్ లెక్కలు నైజాంలో 203.40 కోట్ల షేర్ మార్క్ ని అందుకుని ఎపిక్ రికార్డ్ ను నమోదు చేశాయి. ఈ రికార్డ్ ను ఫ్యూచర్ లో ఏడాది గ్యాప్ లో ఇతర హీరోలు ఎప్పటికి అందుకుంటారో చూడాలి ఇక…

Kalki 2898 AD 7 Weeks (49 Days) Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here