బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ మోస్ట్ 2 నెలల తర్వాత తిరిగి కలెక్షన్స్ సందడి అంతటా ఆనందాన్ని కలిగిస్తుంది. పోటిలో రిలీజ్ అయిన బింబిసార మరియు సీతా రామం 2 సినిమాలు కూడా సూపర్ పాజిటివ్ రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకోగా ఓపెనింగ్స్ పరంగా సీతా రామం బింబిసారతో పోల్చితే కొంచం స్లో అయినా కానీ రెండో రోజుకి వచ్చే సరికి మాత్రం ఎక్స్ లెంట్ ట్రెండ్ ని చూపించి దుమ్ము లేపింది.
ఇక మూడో రోజు ఆదివారం అడ్వాంటేజ్ తో మరింత మంచి హోల్డ్ తో దూసుకు పోతున్న సీతా రామం ఆల్ మోస్ట్ ఇప్పుడు రెండో రోజు లెవల్ లోనే రాంపేజ్ ను చూపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. బి సి సెంటర్స్ లో బింబిసార హావా కొనసాగుతుండగా….
ఏ సెంటర్స్ లో సీతా రామం ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపిస్తుంది. బింబిసార మూడో రోజు కూడా బాక్స్ ఆఫీస్ రాంపేజ్ ను చూపించడం స్టార్ట్ చేయగా చాలా సెంటర్స్ లో హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయి. దాంతో మూడో రోజు కలెక్షన్స్ కూడా రెండో రోజు లెవల్ లో…
ఉండే అవకాశం ఎంతైనా ఉంది అనిపించేలా 2 సినిమాలు జోరు చూపిస్తున్నాయి. సీతా రామం మరోసారి 1.8 కోట్ల నుండి 2 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని ఈ రోజు సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉందని చెప్పాలి. ఇక బింబిసార బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో రోజు 4 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు…
మొత్తం మీద డే ఎండ్ అయ్యే టైం కి ఈ 2 సినిమాలు ఇదే రేంజ్ లో పెర్ఫార్మ్ చేస్తే అనుకున్నట్లే ఈ కలెక్షన్స్ ని మరోసారి అందుకునే అవకాశం మించి పోయే ఔట్ రైట్ చాన్స్ ఉందని చెప్పాలి. ఇక డే ఎండ్ అయ్యే టైం కి సినిమాల ఓవరాల్ రిపోర్ట్స్ ని మరోసారి చూసి ఎంతవరకు కలెక్షన్స్ ని సాధిస్తాయో అప్ డేట్ చేస్తాం…..