బాక్స్ ఆఫీస్ దగ్గర దసరా పండగ హాలిడే లో రిలీజ్ అయిన గాడ్ ఫాదర్ సినిమా ఉన్న లిమిటెడ్ రిలీజ్ లో మంచి కలెక్షన్స్ నే సొంతం చేసుకోగా సినిమా రెండో రోజు కూడా పార్షిక హాలిడే అడ్వాంటేజ్ తో మంచి హోల్డ్ నే చూపించింది. ఇక మూడో రోజు వీకెండ్ స్టార్ట్ అయినా కానీ ఈ రోజు కొంచం వర్కింగ్ డే నే అని చెప్పాలి. దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
డ్రాప్స్ ను మరోసారి సొంతం చేసుకుంది, మార్నింగ్ షోలకు కొంచం ఎక్కువ డ్రాప్స్ కనిపించగా మ్యాట్నీ షోల నుండి సినిమా పుంజుకుంటూ వెళుతూ ఉండగా ఓవరాల్ గా డే 2 తో పోల్చితే సినిమా 35% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకుంది అని చెప్పాలి.
కానీ ఈవినింగ్ షోల బుకింగ్స్ డీసెంట్ గానే జరుగుతూ ఉండటం టాక్ ఎలాగూ పాజిటివ్ గానే ఉండటంతో సినిమా తిరిగి ఈవినింగ్ షోలకి హోల్డ్ చేసే అవకాశం ఎంతైనా ఉంది. మొత్తం మీద సినిమా ఇప్పుడు రెండో రోజు ప్రజెంట్ ట్రెండ్ ని బట్టి చూస్తూ ఉంటె….
5 కోట్ల రేంజ్ లో షేర్ ని అటూ ఇటూగా అందుకునే అవకాశం కనిపిస్తుంది, అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ బాగుండి సినిమా ఇంకా జోరు చూపిస్తే ఈ కలెక్షన్స్ 5.5 కోట్ల దాకా వెళ్ళే అవకాశం ఉందని చెప్పాలి… 6 కోట్ల దాకా వెలితే మూడో రోజు ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపించినట్లు అని చెప్పొచ్చు. మరి సినిమా ఎలా హోల్డ్ చేస్తుందో చూడాలి.