Home న్యూస్ మన్మథుడు2@డే 3 కలెక్షన్స్….దెబ్బ పడింది సామి!

మన్మథుడు2@డే 3 కలెక్షన్స్….దెబ్బ పడింది సామి!

0

     బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు హైర్స్ హెల్ప్ తో సాలిడ్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న మన్మథుడు2 సినిమా రెండో రోజు కూడా అలాంటి మ్యాజిక్ చేస్తుంది అనుకుంటే షాక్ ఇచ్చే విధంగా కలెక్షన్స్ ని సాధించింది, మొత్తం మీద 2 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 7 కోట్ల లోపు షేర్ ని అందుకోగా ఇప్పుడు మూడో రోజు ఆదివారం అవ్వడం తో జోరు పెంచుకుంది అనుకున్నా కానీ అలా జరగడం లేదు.

సినిమా క్లాస్ సెంటర్స్ లో పర్వాలేదు అనిపించినా మాస్ సెంటర్స్ మాత్రం కష్టంగా అనిపిస్తుంది. మీడియం రేంజ్ మూవీస్ విషయం లో చాలా వరకు రెండో రోజు కన్నా మూడో రోజు ఆదివారం అవ్వడం కొంచం గ్రోత్ ఎక్కువగా కనిపిస్తుంది, కానీ మన్మథుడు2 విషయం లో అలా జరగడం లేదు.

రెండో రోజు తో పోల్చితే మూడో రోజు డ్రాప్స్ 35% వరకు వెళ్ళినట్లు సమాచారం, దాంతో ఆన్ లైన్ టికెట్ సేల్స్ ని బట్టి చూస్తె సినిమా ప్రస్తుతానికి మూడో రోజున 1.1 కోట్ల రేంజ్ షేర్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో అందుకునే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. ఒకవేళ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ బాగుండి….

మాస్ సెంటర్స్ లో కూడా ఓవరాల్ గా జోరు బాగుంటే మొత్తం మీద 1.2 కోట్ల నుండి 1.3 కోట్ల దాకా షేర్ ని సినిమా అందుకోవచ్చు. మొత్తం మీద వీకెండ్ కష్టంగానే ముగించనున్న ఈ సినిమా సోమవారం నుండి వర్కింగ్ డే టెస్ట్ ను ఎదురుకోబోతుంది కాబట్టి…

ప్రీ రిలీజ్ బిజినెస్ ని అందుకోవాలి అంటే భారీ ఎత్తున హోల్డ్ చేసి కలెక్షన్స్ ని సాధిస్తేనే బిజినెస్ దరిదాపుల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది, లేక పొతే మాత్రం కష్టమే అని చెప్పాలి. ప్రస్తుతానికి మూడో రోజు దెబ్బ చూస్తుంటే మాత్రం అది అసాధ్యంగానే కనిపిస్తుంది. ఇక వీకెండ్ ఆఫీషియల్ కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here