బాక్స్ ఆఫీస్ దగ్గర పుష్ప సినిమా రెండు రోజుల్లో ఊహకందని కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం చేసింది. ముఖ్యంగా మొదటి రోజు ఆంధ్రాలో ఎదురుదెబ్బ పడగా అది రెండో రోజు కూడా కొనసాగినా కానీ నైజాంలో 5 షోల అడ్వాంటేజ్ అండ్ టికెట్ హైక్స్ సినిమా కి ఓ రేంజ్ లో హెల్ప్ చేసి సెన్సేషనల్ కలెక్షన్స్ వచ్చేలా చేశాయి. దాంతో సినిమా రెండో రోజు ఊహకందని గ్రోత్ ని సొంతం చేసుకుంది.
ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు మూడో రోజులో అడుగు పెట్టగా అన్ని చోట్లా కూడా సినిమా సెన్సేషనల్ అనిపించే రేంజ్ లో హోల్డ్ ని సొంతం చేసుకుని కుమ్మేస్తుంది. తెలుగు రాష్ట్రాలలో రెండో రోజు తో పోల్చితే మూడో రోజు మార్నింగ్ అండ్ నూన్ షోలకి…
సినిమా 25% లోపే డ్రాప్స్ ను సొంతం చేసుకోగా ఈవినింగ్ షోల బుకింగ్స్ కూడా సాలిడ్ గా కొనసాగుతున్నాయి. ఇక సినిమా హిందీ లో ఎక్స్ లెంట్ ట్రెండ్ ని చూపెడుతూ ఉండగా కర్ణాటక కేరళ మరియు తమిళనాడులలో కూడా ఎక్స్ లెంట్ హోల్డ్ ను సొంతం చేసుకుంది.
దాంతో సినిమా ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో మూడో రోజు అవలీలగా 10 కోట్లకు పైగా షేర్ కన్ఫాం అవ్వగా 11 కోట్ల మార్క్ ని అందుకునే ఛాన్స్ కూడా పుష్పలంగా ఉండగా ఈవినింగ్ షోల రిపోర్ట్స్ ని బట్టి అంతకన్నా ముందుకు ఎంతవరకు వెళ్ళగలుగుతుందో అనేది తెలియనుంది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా ఈ రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మరో సారి 16 కోట్లకు పైగా షేర్ ని…
సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉండగా అంతకన్నా ముందుకు వెళుతుందో లేదో నైట్ షోల రిపోర్ట్ తో తేలనుంది. ఓవరాల్ గా సినిమా మూడో రోజు టాలీవుడ్ లో మరో నాన్ బాహుబలి రికార్డ్ ను నమోదు చేసే అవకాశం అయితే పుష్కలంగా ఉందని చెప్పాలి. ఇక నైట్ షోల టైం కి సినిమా రిపోర్ట్స్ ఎలా ఉన్నాయో చూసి మరోసారి అప్ డేట్ చేస్తాం.