బాక్స్ ఆఫీస్ దగ్గర క్లాస్ మూవీ తో సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము లేపడానికి సిద్ధం అయిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ రాధే శ్యామ్ సినిమా రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర అంచనాలను చాలా వరకు మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకోవడం విశేషం అని చెప్పాలి. సినిమా రెండో రోజు 12.32 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపగా…
బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు మూడో రోజు లో ఎంటర్ అయిన ఈ క్లాస్ మూవీ మరోసారి మాస్ హోల్డ్ తో దూసుకు పోతుంది, రెండో రోజు తో పోల్చితే మూడో రోజు మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు ఆల్ మోస్ట్ 20% కి అటూ ఇటూ గా డ్రాప్స్ ను ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో…
సొంతం చేసుకున్న సినిమా ఆఫ్ లైన్ లో మాస్ సెంటర్స్ లో కూడా కొంచం డ్రాప్ అయింది. అయినా కానీ సినిమా టాక్ కి జానర్ దృశ్యా మూడో రోజు కూడా ఓవరాల్ గా మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకునేలా ఉండగా హిందీ లో మాత్రం షోలు తగ్గిపోయాయి.
అక్కడ ది కాశ్మీర్ ఫైల్స్ ఊహకందని రేంజ్ లో గ్రోత్ చూపెట్టడంతో ఆ ఇంపాక్ట్ రాధే శ్యామ్ పై పడగా అక్కడ ఈ రోజు మరోసారి 4-5 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు సినిమా మూడో రోజు మొత్తం మీద 10 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే…
అవకాశం ఉందని పిస్తుంది అని చెప్పాలి. ఇక రోజు మొత్తం మంచి ట్రెండ్ ని ఇలానే కొనసాగిస్తే సినిమా ఇంకా బెటర్ గా రోజును ముగించే అవకాశం ఉంటుంది అని చెప్పాలి. కానీ అందుకోవాల్సిన టార్గెట్ చాలా పెద్దది అవ్వడంతో వర్కింగ్ డేస్ లో సినిమా ఇంకా బెటర్ గా హోల్డ్ చేయాలి. ఇక మూడో రోజు డే ఎండ్ అయ్యే టైం కి ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.