సాహో రిలీజ్ అయిన 2 రోజులు పూర్తీ అయ్యే సరికి బాక్స్ ఆఫీస్ దగ్గర 104 కోట్లకు పైగా షేర్ ని అందుకోగా గ్రాస్ 186 కోట్లకు పైగా వచ్చింది, నిర్మాతల లెక్కల్లో అది 205 కోట్ల కి మించింది, ఇక సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు టాక్ కి ఇప్పుడు సినిమా హోల్డ్ చేసిన విధానానికి మెచ్చుకుని తీరాల్సిందే, ముఖ్యంగా హిందీ కలెక్షన్స్ సినిమా కి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ గా మారాయి అని చెప్పాలి.
సినిమా మూడో రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో ఆల్ మోస్ట్ రెండో రోజు లెవల్ లోనే ఓపెన్ అవ్వగా కొన్ని చోట్ల కొంచం గ్రోత్ అలాగే కొన్ని చోట్ల డ్రాప్స్ తో రన్ అవుతుంది, కానీ టాక్ కి అతీతంగా మూడో రోజు కూడా ఇప్పుడు ఈవినింగ్ అండ్ నైట్ షోలకి ట్రెండ్ ఇలాగే కొనసాగితే…
మరోసారి 10 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని దిమ్మతిరిగే షాక్ ఇచ్చేలా కనిపిస్తుంది. ఇంతకి మించిన షాక్ హిందీ లో ఉంది. సినిమా అక్కడ తొలి 2 రోజులను మించే విధంగా మూడో రోజు అల్టిమేట్ ట్రెండ్ ని కొనసాగిస్తూ మరోసారి 25 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ ని సాధించబోతుంది.
ఇక కర్ణాటక పర్వాలేదు అనిపించుకోగా తమిళ్ అండ్ కేరళ రాష్ట్రాలలో మాత్రం సినిమా కి ఏమాత్రం కలిసి రాలేదు, చాలా చోట్లా డెఫిసిట్లు కూడా పడ్డాయట. అక్కడ కూడా బాగా పెర్ఫార్మ్ చేసి ఉంటె సినిమా రేంజ్ మరో లెవల్ లో ఉండేది. మొత్తం మూడో రోజు ఈవినింగ్ అండ్ నైట్ షోల బుకింగ్స్…
అండ్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ అనుకున్న విధంగా ఉంటె మరోసారి 25 కోట్ల నుండి 28 కోట్ల మధ్యలో వరల్డ్ వైడ్ షేర్ ని, 50 కోట్లకు పైగా గ్రాస్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు. మరి రోజు ముగిసే సరికి సినిమా స్టేటస్ ఎలా ఉంటుందో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.