బాక్స్ ఆఫీస్ దగ్గర రామ్ పోతినేని లేటెస్ట్ మూవీ ది వారియర్ కలెక్షన్స్ పరంగా మంచి ఓపెనింగ్స్ ని అందుకున్నా కానీ రెండో రోజు కి వచ్చే సరికి హెవీ డ్రాప్స్ నే సొంతం చేసుకుంది. ఇక మూడో రోజు వీకెండ్ స్టార్ట్ అయినా కానీ పెద్దగా అడ్వాంటేజ్ ను అయితే చూపించడం లేదు. ఆన్ లైన్ టికెట్ సేల్స్ అసలు ఏమాత్రం ఇంప్రూవ్ మెంట్ లేక పోవడంతో టోటల్ గా…
ఆఫ్ లైన్ కౌంటర్ టికెట్ సేల్స్ పైనే సినిమా డిపెండ్ అయింది, మాస్ సెంటర్స్ లో ఓకే కానీ క్లాస్ సెంటర్స్ లో ఆ బుకింగ్స్ కూడా యావరేజ్ గానే ఉండగా మొత్తం మీద రెండో రోజు తో పోల్చితే మూడో రోజు 30% రేంజ్ లో డ్రాప్ అయింది సినిమా.
దాంతో మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో 1.5-1.6 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలను మించితే 1.8 కోట్ల దాకా షేర్ ని అందుకోవచ్చు. కానీ ఈ కలెక్షన్స్ అసలు బ్రేక్ ఈవెన్ దరిదాపుల్లోకి వెళ్ళడానికి కూడా సరిపోవు అనే చెప్పాలి. ఇక టోటల్ 3 డేస్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి…..