Home న్యూస్ డే 3 – 9.15 ఏంటి సామి….యంగ్ టైగర్ మాస్ పవర్!

డే 3 – 9.15 ఏంటి సామి….యంగ్ టైగర్ మాస్ పవర్!

0

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) కొరటాల శివల కాంబోలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ అయిన దేవర పార్ట్1(Devara Part 1 Movie) ఆడియన్స్ ముందుకు భారీ అంచనాల నడుమ ఈ నెల 27న రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా రిలీజ్ కి టైం దగ్గర పడుతూ ఉండగా ఆడియన్స్ లో సినిమా మీద క్రేజ్ పెరిగి పోతూ ఉంది…

ట్రైలర్ కి ఇనీషియల్ గా రికార్డులను అందుకునే విషయంలో కొంచం వెనకడుగు వేసినా కూడా లాంగ్ రన్ లో ఇప్పుడు అద్బుతాలు సృష్టిస్తూ దూసుకు పోతుంది. ట్రైలర్ కి మొదటి 24 గంటల్లో వ్యూస్ అప్ డేట్ అవ్వక పోవడంతో సోషల్ మీడియాలో ట్రోల్స్ గట్టిగానే పడ్డాయి..

కానీ 24 గంటల తర్వాత అప్ డేట్ అవ్వడం మొదలు పెట్టగా ఆగిపోయిన వ్యూస్ అన్నీ అప్ డేట్ అవుతూ లాంగ్ రన్ లో సాలిడ్ రికార్డులను సొంతం అయ్యేలా చేస్తుంది సినిమా ట్రైలర్ పేరిట… మొదటి రోజు 10.38 మిలియన్ వ్యూస్ అప్ డేట్ అవ్వగా రెండో రోజు అన్ని వ్యూస్ అప్ డేట్ అయ్యి…

టోటల్ గా 2 రోజుల్లో 30.85 మిలియన్ దాకా వ్యూస్ ను సొంతం చేసుకున్న ట్రైలర్ రెండో రోజు ఓవరాల్ గా 20.47 మిలియన్ దాకా వ్యూస్ తో మాస్ రచ్చ చేసింది. ఇక మూడో రోజు కూడా సాలిడ్ వ్యూస్ ను సొంతం చేసుకున్న దేవర ట్రైలర్ ఓవరాల్ గా 9.15 మిలియన్ వ్యూస్ ను…

మూడో రోజు అందుకుని దుమ్ము లేపుతూ మూడు రోజుల టైంకే ఓవరాల్ గా 40 మిలియన్స్ దాకా వ్యూస్ మార్క్ ని దాటేసింది. రీసెంట్ టైం లో వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రెండ్ ను సొంతం చేసుకున్న ట్రైలర్ గా దూసుకు పోతుంది…ఇలానే ఊపు కొనసాగిస్తే ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా సినిమా సంచలనాలు సృష్టించే అవకాశం ఎంతైనా ఉంటుంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here