బాక్స్ ఆఫీస్ దగ్గర వరుస ఫ్లాఫ్స్ లో ఉన్నప్పటికీ కెరీర్ బెస్ట్ వాల్యూ బిజినెస్ ను సొంతం చేసుకున్న నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram) నటించిన లేటెస్ట్ మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి(Arjun Son Of Vyjayanthi Movie)తో కలెక్షన్స్ పరంగా అనుకున్న రేంజ్ లో న్యాయం అయితే చేయలేక పోతున్నాడు…
సినిమా మొదటి రెండు రోజుల్లో వాల్యూ టార్గెట్ లో 20% లోపే రికవరీని సొంతం చేసుకుంది… ఇక మూడో రోజు సండే అడ్వాంటేజ్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగిన ఉన్నంతలో రెండో రోజు లెవల్ కి కొంచం అటూ ఇటూగా అయితే ట్రెండ్ ను చూపెడుతుంది కానీ…
సినిమా అందుకోవాల్సిన టార్గెట్ కి తగ్గ రేంజ్ లో అయితే గ్రోత్ లేదనే చెప్పాలి. సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా మూడో రోజు మినిమమ్ 3.5-4 కోట్ల రేంజ్ కి తగ్గని షేర్ ని సినిమా అందుకోవాల్సిన అవసరం ఉంటుంది…
కానీ ఓవరాల్ గా రెండో రోజు మీద కొంచం గ్రోత్ ని మాత్రమే చూపెడుతూ ఉండటంతో మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో సినిమా 1.4-1.5 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే….
ఈ లెక్క మరికొంత పెరిగే అవకాశం ఉంది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 1.7 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే సొంతం చేసుకునే అవకాశం ఉండగా… ఓవరాల్ గా ఇంకా జోరుని సాలిడ్ గా పెంచాల్సిన…
అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పాలి. మొత్తం మీద వీకెండ్ ని యావరేజ్ రేంజ్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకుని వర్కింగ్ డేస్ లోకి అడుగు పెట్టబోతున్న సినిమా ఎలాంటి కలెక్షన్స్ తో హోల్డ్ ని చూపిస్తుందో చూడాలి. ఇక 3 రోజుల అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.