Home న్యూస్ 3rd డే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఓపెనింగ్స్!!

3rd డే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఓపెనింగ్స్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram) నటించిన లేటెస్ట్ మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి(Arjun Son Of Vyjayanthi Movie), రీసెంట్ గా రిలీజ్ అయ్యి పర్వాలేదు అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకున్నా కలెక్షన్స్ పరంగా ఓపెనింగ్స్ అనుకున్న రేంజ్ లో ఇంపాక్ట్ ను అయితే…

చూపించ లేక పోతూ ఉండగా 2 రోజుల్లో 19% రేంజ్ లోనే రికవరీని సొంతం చేసుకున్న సినిమా మూడో రోజు సండే అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ కూడా ఆశించిన రేంజ్ కి మించి ముందుకు అయితే వెళ్ళడం లేదు కానీ ఉన్నంతలో మరోసారి బాక్స్ ఆఫీస్ దగ్గర…

Arjun Son Of Vyjayanthi Movie 1st Day Total WW Collections!!!

పర్వాలేదు అనిపించే విధంగా హోల్డ్ చేస్తూ రెండో రోజు లెవల్ లో ట్రెండ్ ను చూపెడుతూ ఉండగా, కొన్ని మేజర్ సెంటర్స్ లో రెండో రోజు మీద కొంచం గ్రోత్ ని అయితే చూపెడుతూ ఉందని చెప్పాలి ఇప్పుడు. దాంతో మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర….

ప్రజెంట్ ఓపెనింగ్స్ ను బట్టి చూస్తూ ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 1.2-1.3 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే షేర్ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉంది…

సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోలకు క్రికెట్ మ్యాచ్ ఇంపాక్ట్ లేక పోతే కలెక్షన్స్ ఇంకా పెరగవచ్చు. ఇక సినిమా కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ లో కూడా మరింత జోరు పెంచాల్సిన అవసరం ఉంది. ఇక డే 3 ఎండ్ అయ్యే టైంకి సినిమా ఎలాంటి హోల్డ్ ని చూపెడుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here