బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి 2 రోజుల్లో ఓవరాల్ గా సాలిడ్ కలెక్షన్స్ నే సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన బ్రో మూవీ(Bro The Avatar) సినిమా జానర్ దృశ్యా చూసుకుంటే మంచి హోల్డ్ నే చూపించింది అనే చెప్పాలి. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
మూడో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సండే అడ్వాంటేజ్ తో బరిలోకి దిగిన సినిమాకి ఈ రోజు కలెక్షన్స్ చాలా ముఖ్యం అని చెప్పాలి. రెండో రోజుతో కంపేర్ చేస్తే మూడో రోజు ట్రాక్ చేసిన సెంటర్స్ లో కొంచం డ్రాప్స్ కొన్ని చోట్ల ఉండగా కొన్ని చోట్ల డే 2 రేంజ్ లో సిమిలర్ గా ట్రెండ్ అవుతూ ఉంది.
ఈవినింగ్ అండ్ నైట్ షోలలో సినిమా గ్రోత్ ని చూపించే అవకాశం ఉండగా నైట్ షోలకు నైజాంలో కొంచం డ్రాప్స్ ఉండే అవకాశం ఉంది. ప్రజెంట్ ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి సినిమా ఈ రోజు అటూ ఇటూగా 9 కోట్లకు పైగా షేర్ ని అందుకునే అవకాశం ఉండగా…
అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే సినిమా కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు. ఓవరాల్ గా చూసుకుంటే సినిమా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కల్లో జోరు చూపించి ఈ కలెక్షన్స్ ని మించిపోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
డే 3 ఎండ్ టైంకి ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో జోరు చూపిస్తే సినిమా కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది, ఓవర్సీస్ లో సైతం కొంచం కలెక్షన్స్ అండర్ పెర్ఫార్మ్ చేస్తున్నాయి. ఇక డే 3 ఎండ్ అయ్యే టైంకి సినిమా ఎలాంటి కలెక్షన్స్ తో హోల్డ్ చేస్తుందో చూడాలి ఇక.