బాక్స్ ఆఫీస్ దగ్గర చిన్న సినిమాలు అనుకున్న అంచనాలను మించి పెర్ఫార్మ్ చేస్తే ఆ సినిమాకి లాభాలు ఓ రేంజ్ లో సొంతం అవ్వడం ఖాయం…లేటెస్ట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చిన నాచురల్ స్టార్ నాని(Nani) నిర్మాతగా నిర్మించిన లేటెస్ట్ మూవీ కోర్ట్(Court State Vs A Nobody Movie) సినిమా ఊహకందని రేంజ్ లో…
జోరుని బాక్స్ ఆఫీస్ దగ్గర చూపెడుతూ ఆల్ మోస్ట్ ఒక మీడియం రేంజ్ మూవీ లెవల్ లో కలెక్షన్స్ ని వసూల్ చేస్తూ మాస్ రచ్చ చేస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి. రెండు రోజుల్లో టార్గెట్ మొత్తాన్ని రికవరీ చేసి కుమ్మేసిన ఈ సినిమా ఇప్పుడు మూడోరోజు…
బాక్స్ ఆఫీస్ దగ్గర సండే అడ్వాంటేజ్ తో అన్ని చోట్లా అంచనాలను మించే రేంజ్ లో వసూళ్ళని సాధిస్తుంది. నైట్ షోలకు రేపు పరీక్షలు, వర్కింగ్ డే ఉండటంతో కొంచం డ్రాప్స్ ఉండే అవకాశం ఉన్నప్పటికీ ఓవరాల్ గా రెండో రోజు కి ఏమాత్రం తీసిపోని రేంజ్ లో…
ఎక్స్ లెంట్ గా జోరు ని చూపెడుతున్న సినిమా ఈవినింగ్ షోల ట్రెండ్ చూస్తూ ఉంటే తెలుగు రాష్ట్రాల్లో 5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు కనుక అంచనాలను మించిపోతే ఈ లెక్క 5.5 కోట్ల దాకా కూడా…
వెళ్ళే ఔట్ రైట్ ఛాన్స్ ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా మరోసారి 7 కోట్ల మార్క్ ని దాటేసి 7.5-8 కోట్ల దాకా కూడా ఔట్ రైట్ ఛాన్స్ ఉందని చెప్పాలి. ఓ చిన్న సినిమా అన్ సీజన్ లో ఈ రేంజ్ లో హోల్డ్ చూపించడం మామూలు విషయం కాదు.
మొత్తం మీద నాని బ్రాండ్ వాల్యూ ఇంపాక్ట్ సూపర్ సాలిడ్ గా పని చేసి అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కుమ్మేస్తున్న సినిమా లాంగ్ రన్ లో ఇప్పుడు ఎక్స్ లెంట్ లాభాలను సొంతం చేసుకోబోతుంది. ఇక టోటల్ గా సినిమా వీకెండ్ లో సాధించే అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.