బాక్స్ ఆఫీస్ దగ్గర నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ దసరా 2 రోజుల్లో టాలీవుడ్ టైర్ 2 హీరోల్లో ఫస్ట్ 50 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించగా సినిమా రెండో రోజు వర్కింగ్ డే అయినా మంచి హోల్డ్ నే చూపించింది. ఇక మూడో రోజు వీకెండ్ స్టార్ట్ అవ్వడంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర జోరుని చూపించడం స్టార్ట్ చేయగా కలెక్షన్స్ పరంగా దుమ్ము లేపే ఛాన్స్ లు కనిపిస్తున్నాయి ఇప్పుడు.
మొత్తం మీద నైజాంలో మరోసారి ఎక్స్ లెంట్ గా హోల్డ్ ని చూపిస్తూ దూసుకు పోతున్న దసరా మూవీ ఆంధ్ర సీడెడ్ ఏరియాల్లో ఆల్ మోస్ట్ రెండో రోజుకి సిమిలర్ గానే ట్రెండ్ అవుతుంది ఇప్పుడు. దాంతో సినిమా అటూ ఇటూగా రెండో రోజు లెవల్ లోనే కలెక్షన్స్ ని అందుకునే అవకాశం కనిపిస్తుంది.
ఇక సినిమాకి ఈ రోజు IPL మ్యాచుల నుండి కూడా ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉండటంతో అన్నీంటినీ పరిగణలోకి తీసుకుంటే అటూ ఇటూగా సినిమా మూడో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 6 కోట్ల రేంజ్ లో…
షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది, ఆంధ్ర సీడెడ్ లో రెండో రోజు కన్నా కొంచం బెటర్ గా ఈవినింగ్ అండ్ నైట్ షోలకి సినిమా గ్రోత్ ని చూపిస్తే కలెక్షన్స్ ఇంకా పెరగవచ్చు. ఓవరాల్ గా మళ్ళీ బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా రచ్చ చేస్తున్నా ఆంధ్ర సీడెడ్ లో మరింత జోరు చూపించాల్సి ఉంది. ఇక డే ఎండ్ అయ్యే టైం కి సినిమా ఎంతవరకు కలెక్ట్ చేస్తుందో చూడాలి.