బాక్స్ ఆఫీస్ దగ్గర విశ్వక్ సేన్ నటించిన దాస్ కా ధమ్కీ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి మొదటి 2 రోజుల్లో భాగానే కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. మొదటి రోజు పండగ అవ్వడం, సినిమా అంచనాలను మించి పోయే రేంజ్ వసూళ్ళని అందుకోవడంతో రెండో రోజు కొంచం తగ్గినా పెద్దగా ఇబ్బంది ఏమి రాలేదు అని చెప్పాలి. ఇక సినిమా ఇప్పుడు మూడో రోజు లో అడుగు పెట్టగా ఇప్పుడు…
అసలు సిసలు శుక్రవారం అవ్వడంతో ఈ రోజు నుండే వీకెండ్ స్టార్ట్ అవ్వడంతో సినిమా ఎలా హోల్డ్ చేస్తుంది అన్నది ఆసక్తి కరంగా మారింది. సినిమా మూడో రోజు మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు ఆల్ మోస్ట్ 30% వరకు డ్రాప్స్ ను సొంతం చేసుకున్నా కానీ…
ఈవినింగ్ షోల బుకింగ్స్ కొంచం బెటర్ గా ఉండటంతో సినిమా రోజును బాగానే ముగించే అవకాశం ఉందని చెప్పాలి. ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే సినిమా 60 లక్షల నుండి 65 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే…
సినిమా 70 లక్షల నుండి 75 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు. సినిమా ఒకవేళ 80 నుండి 85 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంటే ఈ రోజును బాగా హోల్డ్ చేసింది అని చెప్పొచ్చు. ఇక డే ఎండ్ అయ్యే టైం కి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.