బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రెండు రోజుల్లో అంచనాలను మించి మాస్ రచ్చ చేసిన నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ హిట్3(Hit 3 Movie) సినిమా కొంచం ఆడియన్స్ ను భారీ లెవల్ లో థియేటర్స్ కి రప్పించే విషయంలో విజయమం సొంతం చేసుకుంది అని చెప్పాలి. సాలిడ్ వసూళ్ళతో దుమ్ము లేపిన ఈ సినిమా…
రెండో రోజు నార్మల్ ఫ్రై డే నే అయినా కూడా అనుకున్న రేంజ్ కన్నా కూడా బెటర్ ట్రెండ్ ను చూపించి సంచలనం సృష్టించింది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు మూడో రోజు వీకెండ్ అడ్వాంటేజ్ ను వాడుకోవడానికి సిద్ధం అవ్వగా ఓపెనింగ్స్ పరంగా శనివారం సినిమా అన్ని చోట్లా ఓపెనింగ్స్…
రెండో రోజు మీద బెటర్ గా ట్రెండ్ ను చూపిస్తూ దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి. కొన్ని చోట్ల బుకింగ్స్ ట్రెండ్ సిమిలర్ గా ఉన్నప్పటికీ మిగిలిన చోట్ల మాత్రం సినిమా లీడ్ ను చూపెడుతూ ఉండటం, ఈవినింగ్ అండ్ నైట్ షోలకు గ్రోత్ ని కూడా చూపించే అవకాశం ఎంతైనా ఉండటంతో…
ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు మూడో రోజు ప్రజెంట్ ఓపెనింగ్స్ ను బట్టి చూస్తూ ఉంటే 6 కోట్ల రేంజ్ నుండి 6.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి, ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోలలో అనుకున్న రేంజ్ లో ట్రెండ్ ని చూపించి…
క్రికెట్ మ్యాచ్ ఇంపాక్ట్ కనుక ఏమి లేక పొతే ఈ లెక్క మరింతగా పెరిగి 6.5-7 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు. ఇక సినిమా కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లలో కూడా ఎక్స్ లెంట్ గా జోరు చూపిస్తూ ఉండటంతో…
వీకెండ్ లోనే బిజినెస్ లో చాలా మొత్తాన్ని ఈజీగా వెనక్కి తీసుకువచ్చే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక సినిమా మూడో రోజు ఎండ్ అయ్యే టైంకి ఇదే రేంజ్ లో ఊపు కొనసాగిస్తుందో లేక ఇంతకుమించిన రాంపెజ్ ను చూపిస్తుందో చూడాలి ఇప్పుడు..