లోక నాయకుడు కమల్ హాసన్(Kamal Haasan) నటించిన లేటెస్ట్ మూవీ భారతీయుడు2 (Bharateeyudu2 Movie) సినిమా మొదటి 2 రోజుల్లో ఓవరాల్ గా పర్వాలేదు అనిపించేలా పెర్ఫార్మ్ చేసినా కూడా మిక్సుడ్ రెస్పాన్స్ వలన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం అనుకున్న రేంజ్ లో హోల్డ్ ని అయితే చూపించ లేక పోతుంది….
మిక్సుడ్ రెస్పాన్స్ ఇంపాక్ట్ గట్టిగానే పడగా 3వ రోజు సండే అడ్వాంటేజ్ ఉన్నా కూడా తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా జోరు కనిపించడం లేదు…దాంతో సినిమా మూడో రోజు సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 1.5-1.8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది…
ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే షేర్ లెక్క పెరగవచ్చు..ఇక తమిళ్ లో మూడో రోజు డ్రాప్ అయిన సినిమా 8-9 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా…
ఓవర్సీస్ కలెక్షన్స్ తో కలిపి సినిమా ఇప్పుడు 3వ రోజు వరల్డ్ వైడ్ గా 22-23 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే గ్రాస్ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పాలి..
ఓవరాల్ గా సినిమా కి వచ్చిన టాక్ దృశ్యా వీకెండ్ లో పర్వాలేదు అనిపించేలా సినిమా పెర్ఫార్మ్ చేసినా కూడా సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా చూసుకుంటే మాత్రం సినిమా బడ్జెట్ కి బిజినెస్ కి ఏమాత్రం న్యాయం అయితే చేయడం లేదు అనే చెప్పాలి. ఇక టోటల్ గా 3 రోజులకు గాను సాధించే కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి ఇక…