బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి 2 రోజుల్లో ఊరమాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసిన కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) నటించిన లేటెస్ట్ మూవీ క(Ka Movie) సాలిడ్ ఓపెనింగ్స్ తో మాస్ రచ్చ చేసిన తర్వాత మూడో రోజు సినిమా అన్ని చోట్లా మాస్ రచ్చ చేస్తూ దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి.
మొదటి 2 రోజుల్లో పోల్చితే మూడో రోజు థియేటర్స్ కౌంట్ కూడా పెరిగి పోగా అన్ని చోట్లా మంచి జోరు చూపెడుతుంది. నైజాం ఏరియాలో మిగిలిన సినిమాలతో పోల్చితే క మూవీకి అనుకున్న రేంజ్ లో స్క్రీన్స్ దొరకలేదు కానీ ఆంధ్రలో మాత్రం సినిమా ఎక్స్ లెంట్ గా జోరు…
చూపెడుతున్న సినిమా మూడో రోజు మరోసారి రెండో రోజు లెవల్ లో ట్రెండ్ ను చూపెడుతూ ఉండగా ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే సినిమా మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్ల రేంజ్ నుండి 2.2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు.
ఇక సినిమా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే షేర్ ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక సినిమా వరల్డ్ వైడ్ గా కూడా మంచి జోరు ని చూపెడుతూ ఉన్న సినిమా 2.6-2.8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా….
ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే ఈ షేర్ ఇంకా పెరిగే అవకాశం ఉంది…..ఓవర్సీస్ లో సైతం సినిమా పుంజుకోవడంతో కలెక్షన్స్ లెక్కలు మరింత జోరు చూపే ఛాన్స్ ఉండగా తెలుగు రాష్ట్రాల్లో కూడా అంచనాలను మరోసారి మించే అవకాశం ఎంతైనా ఉంది. ఇక టోటల్ గా సినిమా 3 రోజుల్లో సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.