రెండో రోజు అంచనాలను మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ కల్కి 2898AD(Kalki2898AD Movie) ఇప్పుడు మూడో రోజులో ఎంటర్ అవ్వగా అన్ని చోట్లా సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మూడో రోజు మాస్ రచ్చ చేస్తూ దూసుకు పోతూ బ్రేక్ ఈవెన్ వైపు ఒక్కో అడుగు ముందుకు వేస్తూ సాలిడ్ లాంగ్ రన్ ని సొంతం చేసుకోబోతుంది.
సినిమా తెలుగు రాష్ట్రాల్లో మరోసారి రెండో రోజు లెవల్ లో చాలా చోట్ల జోరు చూపిస్తూ ఉండగా నైజాంలో సినిమా మరో సారి ఎక్స్ లెంట్ ట్రెండ్ ను చూపెడుతూ ఉంది, ఆంధ్ర సీడెడ్ లో అనుకున్న రేంజ్ లో జోరు అయితే చూపించడం లేదు, అయినా కూడా రెండోతో ఆల్ మోస్ట్ ఈక్వల్ గా కొన్ని చోట్ల లీడ్ లో దూసుకు పోతున్న సినిమా ఓవరాల్ గా ఇప్పుడు….
రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 20 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అన్ని చోట్లా జోరు సాలిడ్ గా ఉండి క్రికెట్ మ్యాచ్ ఇంపాక్ట్ లేకుండా ఉండి ఉంటే 22 కోట్లు ఆ పైన కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఇక హిందీలో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెట్టించిన జోరు చూపిస్తూ ఉండగా ఈ రోజు సినిమా ….
28 కోట్ల నుండి 30 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా కర్ణాటక, తమిళ్ మరియు కేరళ ఏరియాల్లో కూడా సాలిడ్ గా మూడో రోజు రచ్చ చేస్తూ ఉండగా ఈ రోజు సినిమా 8 కోట్లకు అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఇండియాలో సినిమా 3వ రోజు 45 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా…
క్రికెట్ మ్యాచ్ ఇంపాక్ట్ పడకుండా ఉంటే ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉంది, ఇక ఓవర్సీస్ లో మరోసారి ఎక్స్ లెంట్ గా జోరు చూపిస్తున్న సినిమా మరోసారి 10-12 కోట్ల రేంజ్ లో షేర్ ని ఓవర్సీస్ లో అందుకోవచ్చు, ఫైనల్ లెక్కలు బాగుంటే లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉంది. దాంతో ఓవరాల్ గా 3వ రోజున వరల్డ్ వైడ్ గా 55-57 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకోవచ్చు…. ఇక టోటల్ గా 3 రోజుల కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి…