బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి 2 రోజుల్లో ఏమాత్రం ఇంపాక్ట్ ను చూపించ లేక పోయిన కోలివుడ్ స్టార్ హీరో సూర్య(Suriya) కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ తో రూపొందిన సెన్సేషనల్ మూవీ కంగువ(Kanguva) రీసెంట్ గా రిలీజ్ అయ్యి మొదటి రోజే మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న సినిమా ఏ దశలో కూడా అంచనాలను అందుకోలేక పోయింది.
సినిమా రెండు రోజుల్లో అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఏమాత్రం ఇంపాక్ట్ ను చూపించ లేక పోయింది. ఇక మూడో రోజులో అడుగు పెట్టిన సినిమా ఏమైనా హోల్డ్ ని చూపెడుతుందో ఏమో అనుకుంటే సినిమా ఏమాత్రం ఇంపాక్ట్ ను చూపించ లేక పోతుంది…
దెబ్బ మీద దెబ్బ పడింది అనిపించేలా అన్ని చోట్లా గ్రోత్ చూపించాల్సిన చోట మళ్ళీ డ్రాప్స్ ను సొంతం చేసుకుంటూ ఉండగా ఇక తేరుకునే అవకాశం అసలు ఏమాత్రం కనిపించడం లేదు ఇప్పుడు…ఇక సినిమా తెలుగు రాష్ట్రాలలో మరోసారి డ్రాప్స్ ను సొంతం చేసుకున్న సినిమా…
ఓవరాల్ గా ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తుంటే 1 కోటి రేంజ్ కి అటూ ఇటూ షేర్ ని అందుకునే అవకాశం ఉండగా తమిళనాడులో సినిమా 4-5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద సినిమా…
మరోసారి 3.5-4 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉండగా ఓవర్సీస్ లో కూడా పెద్దగా ఇంపాక్ట్ ఏమి కనిపించడం లేదు. దాంతో మొత్తం మీద 3వ రోజు వరల్డ్ వైడ్ గా ఇప్పుడు 13-15 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా…
ఫైనల్ లెక్కలు కొంచం బాగుంటే కలెక్షన్స్ కొంచం పెరగవచ్చు కానీ సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఈ కలెక్షన్స్ అసలు ఏమాత్రం టార్గెట్ దిశగా వెళ్ళే అవకాశమే లేదు అని చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఓవరాల్ గా 3 రోజుల్లో సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.