బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ టైం రిలీజ్ అయినప్పుడు డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకున్నా కూడా రీ రిలీజ్ లో ఊహకందని రేంజ్ లో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తూ మాస్ ఊచకోత కోస్తూ దూసుకు పోతున్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) ఖలేజా(Khaleja4K Re Release) సినిమా…
అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ ఉండగా…ఆల్ రెడీ ఓవర్సీస్ లో సెన్సేషనల్ రికార్డులతో దుమ్ము దుమారం లేపిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో కూడా సాలిడ్ జోరు ని చూపెడుతూ డబుల్ డిజిట్ గ్రాస్ మార్క్ వైపు…
పరుగులు పెడుతూ ఉండటం విశేషం కాగా మూడో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి సండే అడ్వాంటేజ్ తో ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపెడుతూ దూసుకు పోతున్న సినిమా ఇప్పుడు టాలీవుడ్ తరుపున రీ రిలీజ్ మూవీస్ లో…
మూడో రోజు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉంది…నైజాం లో ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపెడుతున్న సినిమా ఆంధ్ర సీడెడ్ లో కూడా మరోసారి పర్వాలేదు అనిపించే రేంజ్ లో..
హోల్డ్ ని చూపెడుతూ ఉండటంతో మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి కోటి మార్క్ కి పైగానే వసూళ్ళని అందుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు కనుక బాగుంటే సినిమా మూడో రోజున…
1-1.1 కోట్ల రేంజ్ లో వసూళ్ళని అందుకునే అవకాశం ఉండగా, ఓవర్సీస్ ఫైనల్ రిపోర్ట్ ఇంకా అప్ డేట్ అవ్వాల్సి ఉండగా లెక్క ఇంకా పెరగవచ్చు… అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో కూడా మూడో రోజు సినిమా జోరు కొనసాగుతూ ఉండటంతో ఈ లెక్క మరింత పెరిగే అవకాశం ఎంతైనా ఉంది.ఇక టోటల్ గా వీకెండ్ కి గాను సినిమా సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.