కింగ్ నాగార్జున(Akkineni Nagarjuna) ధనుష్(Dhanush) కుబేర(Kuberaa Movie) సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ తో మాస్ రచ్చ చేయగా రెండు రోజుల్లో 40% రేంజ్ లో రికవరీతో మాస్ రాంపెజ్ ను చూపించిన సినిమా మూడో రోజు లో ఎంటర్ అవ్వగా అన్ని చోట్లా ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపెడుతూ…
దుమ్ము లేపుతుంది. ఎట్టకేలకు సినిమా తమిళనాడులో కొంచం గ్రోత్ ని మూడో రోజున చూపెడుతూ ఉండగా తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపించగా నైజాంలో నైట్ షోల బుకింగ్స్ ట్రెండ్ కూడా బాగానే ఉండటంతో మొత్తం మీద ఇప్పుడు…
మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 6-6.5 కోట్ల రేంజ్ లో షేర్ ని మరోసారి అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక అంచనాలను మించి పొతే ఈ లెక్క మరింత పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.
ఇక తమిళనాడులో సినిమా మూడో రోజు కొంచం గ్రోత్ ని చూపెడుతూ 5 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకునే అవకాశం ఉండగా ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో కూడా ఈ రోజు మంచి జోరుని చూపెడుతున్న సినిమా ఓవర్సీస్ లో డే 2 కి సిమిలర్ గానే ట్రెండ్ అవుతుంది…
ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా మూడో రోజున సినిమా మరోసారి డబుల్ డిజిట్ షేర్ మార్క్ ని అందుకునే అవకాశం ఉండగా….ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు తమిళ్ లెక్కలు బాగుంటే షేర్ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉంది.
ఓవరాల్ గా క్లాస్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్ లో అంచనాలను మించి మాస్ రాంపెజ్ ను చూపెడుతూ దూసుకు పోతూ ఉండటం విశేషం…ఇక సినిమా ఓవరాల్ గా 3 రోజుల వీకెండ్ లో టోటల్ గా సాధించే కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.