మొదటి రోజు నుండి సూపర్ పాజిటివ్ టాక్ తో అంచనాలను మించి మాస్ జోరు చూపెడుతున్న కింగ్ నాగార్జున(Akkineni Nagarjuna) ధనుష్(Dhanush)ల కాంబో మూవీ కుబేర(Kuberaa Movie) సినిమా వీకెండ్ లో ఓవరాల్ గా రిమార్కబుల్ ట్రెండ్ ను తెలుగు రాష్ట్రాల్లో అలాగే ఓవర్సీస్ లో చూపించగా… తమిళ్ లో మాత్రం అంచనాలను అందుకోలేదు…
కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అంచనాలను మించి జోరు చూపించిన సినిమా మూడో రోజు అంచనాలను అన్నీ మించి పోయే రేంజ్ లో వసూళ్ళని అందుకుంది. క్లాస్ సినిమాకి ఈ రేంజ్ లో గ్రోత్ సొంతం అవ్వడం అన్నది ఎవ్వరూ ఎక్స్ పెర్ట్ చేయని రాంపెజ్ అనే చెప్పాలి.
ఏకంగా 7.85 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో మీడియం రేంజ్ మూవీస్ లో ఆల్ టైం టాప్ 3 ప్లేస్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది. మొత్తం మీద మూడో రోజు హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న టాప్ మీడియం రేంజ్ మూవీస్ ని గమనిస్తే…
Day 3 AP-TG Top collections for Medium Range Movies
👉#Thandel- 8.40Cr
👉#Uppena – 8.26Cr
👉#Kuberaa- 7.85Cr*******
👉#TilluSquare – 7.44Cr
👉#DASARA – 6.73Cr
👉#MadSquare – 5.88CR
👉#Virupaksha – 5.77CR
👉#HanuMan- 5.70CR
👉#Kushi- 5.68Cr
👉#HIT3 Movie- 5.50Cr
👉#LoveStory- 5.19Cr
👉#Bimbisara- 5.02CR
👉#SaripodhaaSanivaaram – 4.68CR
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ ట్రెండ్ ను చూపించగా టాప్ ప్లేస్ లో తండేల్ టాప్ లో ఉండగా నాలుగేళ్ళ క్రితం ఉప్పెన ఇంకా టాప్ 2 లో కొనసాగుతుంది. క్లాస్ మూవీ అయిన కుబేర టాప్ 3 తో మాస్ రచ్చ చేయగా…ఇక వర్కింగ్ డేస్ లో కుబేర ఎలాంటి కలెక్షన్స్ తో దుమ్ము లేపుతుందో చూడాలి.