యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ లైగర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా మొదటి ఆటకే ఫ్లాఫ్ టాక్ ని తెచ్చుకోగా ఏ దశలో కూడా ఇక తిరిగి తేరుకోలేక పోయింది సినిమా. తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు రికార్డులు క్రియేట్ చేయాల్సిన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అంచనాలను అందుకోలేక పోయింది. ఇక రెండో రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
కంప్లీట్ గా చేతులు ఎత్తేసింది, కానీ అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఈ కలెక్షన్స్ అసలు ఏమాత్రం సరిపోవు అనే చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో రోజు తెలుగు రాష్ట్రాలలో మరోసారి 25-30% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకుంది ఇప్పుడు…
దాంతో సినిమా తెలుగు రాష్ట్రాల్లో ప్రజెంట్ ట్రెండ్ ని బట్టి చూస్తూ ఉంటే సినిమా ఇప్పుడు 1.2 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉండగా హిందీ లో పర్వాలేదు అనిపించే విధంగా హోల్డ్ చేస్తున్న సినిమా ఈ రోజు టోటల్ వరల్డ్ వైడ్ గా అటూ ఇటూగా ఇప్పుడు…
3 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో అందుకోవాల్సిన టార్గెట్ చాలా ఎక్కువగా ఉండటంతో ఈ హోల్డ్ అసలు ఏమాత్రం సరిపోదు అనే చెప్పాలి ఇప్పుడు. ఇక డే ఎండ్ అయ్యే టైం కి బాక్స్ ఆఫీస్ దగ్గర ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు ఏమైనా ఇంప్రూవ్ అయితే…
కలెక్షన్స్ ఇంకొంచం పెరిగే అవకాశం ఉందని చెప్పాలి కానీ అందుకోవాల్సిన 90 కోట్ల టార్గెట్ కి ఈ కలెక్షన్స్ సరిపోవు అనే చెప్పాలి. సినిమాను కొన్న బయ్యర్లు థియేటర్స్ ఓనర్స్ కి ఇప్పుడు సినిమా అత్యంత భారీ నష్టాలను సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉండటం విచారకరం అని చెప్పాలి.