బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి 2 రోజుల్లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపిన దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) నటించిన లేటెస్ట్ మూవీ లక్కీ భాస్కర్(Lucky Baskhar Movie) తెలుగు రాష్ట్రాల్లో మిగిలిన సినిమాలను డామినేట్ చేస్తూ ఓవరాల్ కలెక్షన్స్ లో లీడ్ ను చూపెడుతూ ఉండగా కేరళలో కూడా సినిమా…
మంచి స్టార్ట్ తర్వాత కలెక్షన్స్ లో గ్రోత్ ని చూపెడుతూ మాస్ రచ్చ చేస్తుంది….ఇక మిగిలిన చోట్ల కూడా సినిమా గ్రోత్ ని చూపెడుతూ ఉండటంతో ఓవరాల్ గా కలెక్షన్స్ పరంగా లాంగ్ వీకెండ్ లో బిజినెస్ లో చాలా మొత్తాన్ని ఇప్పుడు వెనక్కి తీసుకురావడం ఖాయంగా కనిపిస్తూ ఉంది.
సినిమా ఇక మూడో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఎక్స్ లెంట్ గా జోరు చూపిస్తూ ఉండగా మేజర్ గా ఎక్కువ షోలు నైజాంలో పడగా ఆక్యుపెన్సీ ఎక్స్ లెంట్ గా ఉంది. ఆంధ్ర సీడెడ్ లో పర్వాలేదు అనిపిస్తున్న సినిమా మొత్తం మీద ఇప్పుడు…
తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా మరోసారి 2 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఫైనల్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండొచ్చు. ఇక కేరళలో మరోసారి స్ట్రాంగ్ జోరుని చూపిస్తున్న సినిమా మిగిలిన చోట్ల కూడా…
రెండో రోజు లెవల్ లోనే రచ్చ చేస్తూ ఉండటంతో వరల్డ్ వైడ్ గా మూడో రోజు మరోసారి 10 కోట్ల రేంజ్ లోనే గ్రాస్ ను అందుకునే అవకాశం ఉంది. ఆఫ్ లైన్ లెక్కలు అంచనాలను మించిపోతే ఈ కలెక్షన్స్ ని కూడా సినిమా దాటేసే అవకాశం ఉందని చెప్పాలి…ఇక టోటల్ గా సినిమా 3 రోజుల్లో సాధించే అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.