బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు రోజుల్లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో బిజినెస్ లో చాలా మొత్తాన్ని రికవరీ చేసి మాస్ ఊచకోత కోసిన మ్యాడ్ స్క్వేర్(Mad Square Movie) అన్ని చోట్లా ఎక్స్ లెంట్ హోల్డ్ ను చూపెడుతూ ఉండగా మూడో రోజు సండే అలాగే ఉగాది పండగ అడ్వాంటేజ్ లు కలిసి రావడంతో మరింత జోరు చూపెడుతూ..
మాస్ రచ్చ చేస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి. ఓవర్సీస్ లో సినిమా 1 మిలియన్ మార్క్ వైపు పరుగులు పెడుతూ ఉండగా తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు ఆల్ మోస్ట్ బ్రేక్ ఈవెన్ ని దాటడం ఖాయమని చెప్పాలి. ఓవరాల్ గా రెండో రోజుకి ఏమాత్రం తీసిపోని విధంగా సినిమా…
మాస్ కుమ్ముడు కుమ్మేస్తూ ఉండగా ఈవినింగ్ అండ్ నైట్ షోలకు కూడా అన్ని చోట్లా ఎక్స్ లెంట్ ట్రెండ్ ను చూపించే అవకాశం ఉన్న నేపధ్యంలో మరోసారి బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఓవరాల్ గా 4.5-5 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉండగా..
ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు కనుక బాగుంటే షేర్ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇక వరల్డ్ వైడ్ గా కూడా ఎక్స్ లెంట్ గా జోరు చూపెడుతున్న సినిమా వరల్డ్ వైడ్ గా 3వ రోజున 6 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని దాటే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు…
మొత్తం మీద సినిమా రిమార్కబుల్ జోరు ని చూపెడుతూ ఉండగా ఈ రోజు 2 మ్యాచుల ఇంపాక్ట్ ఉన్నప్పటికీ మేజర్ సెంటర్స్ లో ఎక్స్ లెంట్ హోల్డ్ కొనసాగే అవకాశం ఉండటంతో డే ఎండ్ అయ్యే టైంకి ఎంతవరకు అనుకున్న అంచనాలను సినిమా మించగలుగుతుందో లేదో చూడాలి ఇప్పుడు.