ఈ శివరాత్రి కానుకగా ఆడియన్స్ ముందుకు వచ్చిన సందీప్ కిషన్(Sundeep Kishan) నటించిన లేటెస్ట్ మూవీ మజాకా(Mazaka Movie)సినిమా, మొదటి రోజు హాలిడే అడ్వాంటేజ్ తో సందీప్ కిషన్ కెరీర్ లో సెకెండ్ బెస్ట్ ఓపెనింగ్స్ ను నమోదు చేయగా రెండో రోజుకి వచ్చేసరికి వర్కింగ్ డే ఇంపాక్ట్ వలన ఓవరాల్ గా..
12 వేల లోపు టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని డీసెంట్ అనిపించుకున్నా ఇంకా బెటర్ గా హోల్డ్ చేయాల్సిన అవసరం ఉండగా…ఇక మూడో రోజు నుండి వీకెండ్ స్టార్ట్ అవ్వగా కొత్త సినిమాలు కొన్ని రిలీజ్ అయినా కూడా ఉన్నంతలో మజాకా మూవీ..
బాక్స్ ఆఫీస్ దగ్గర లిమిటెడ్ డ్రాప్స్ నే సోట్నం చేసుకుని పరుగును కొనసాగిస్తూ ఉండగా, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు పర్వాలేదు అనిపించేలా ఉండగా మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి చూస్తూ ఉంటే…
సినిమా 45-50 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే షేర్ ఇంకొంచం పెరిగే అవకాశం ఉంది. ఇక సినిమా కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లలో ఓకే అనిపించే రేంజ్ లో ట్రెండ్ ను…
చూపెడుతూ ఉండగా ఓవరాల్ గా ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి చూస్తూ ఉంటే 60 లక్షల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉంది…సినిమా అందుకోవాల్సిన టార్గెట్ ఇంకా జోరు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక 3 డేస్ టోటల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.