మంచి అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు వచ్చిన యూత్ స్టార్ నితిన్(Nithiin) నటించిన లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్(RobinHood Movie) సినిమా పర్వాలేదు అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకున్నా కూడా కలెక్షన్స్ పరంగా మాత్రం అనుకున్న రేంజ్ లో ఇంపాక్ట్ ని అయితే చూపించడం లేదు…
సినిమా రెండు రోజుల్లో చాలా లిమిటెడ్ రికవరీనే సొంతం చేసుకోగా మూడు, నాలుగు రోజుల్లో సాలిడ్ గ్రోత్ ను చూపించాల్సిన అవసరం ఉండగా మూడో రోజు ఉగాది అండ్ సండే అడ్వాంటేజ్ తో ఉన్నంతలో పర్వాలేదు అనిపించే రేంజ్ లో ట్రెండ్ ను చూపెడుతున్న సినిమా…
రెండో రోజు మీద బెటర్ గానే ఉంది కానీ ఓవరాల్ గా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా మాత్రం ఇంకా సాలిడ్ గా జోరు ని చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక మొత్తం మీద మూడో రోజు సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు 1.2-1.5 కోట్ల రేంజ్ లో షేర్ ని…
ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే సొంతం చేసుకునే అవాకాశం ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే షేర్ ఇంకా పెరిగే అవకాశం ఉంది, ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లో కూడా మరీ అనుకున్న రేంజ్ లో ట్రెండ్ ను చూపించ లేక పోతున్న సినిమా…
ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా సినిమా 3వ రోజున ఇప్పుడు 1.8 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండొచ్చు. ఇక టోటల్ గా 3 రోజుల అఫీషియల్ కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.