బాక్స్ ఆఫీస్ దగ్గర పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ సలార్(salaar part 1 – ceasefire) సినిమా మొదటి 2 రోజుల్లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో 250 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూళ్ళని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపగా సినిమా రెండో రోజు అనుకున్న రేంజ్ లో…
హోల్డ్ చేసి సంచలనం సృష్టించింది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇక మూడో రోజులో ఎంటర్ అవ్వగా అన్ని చోట్లా మరోసారి మంచి జోరుని చూపిస్తూ ఉండగా సినిమా మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో డే 2 రేంజ్ లో ఓపెనింగ్స్ కనిపిస్తూ ఉండగా ఈవినింగ్ అండ్ నైట్ షోలలో కూడా సాలిడ్ గా జోరు చూపించే అవకాశం ఉంది.
దాంతో ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే సినిమా 20 కోట్ల రేంజ్ లో షేర్ ని మరోసారి అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా సినిమా హిందీలో మూడో రోజు తొలి 2 రోజుల కన్నా బెటర్ గా ట్రెండ్ అవుతూ ఉండటం విశేషం అని చెప్పాలి. ఇక కర్ణాటకలో కూడా మంచి ట్రెండ్ ను చూపిస్తూ ఉండగా….
తమిళ్ మరియు కేరళలో పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేస్తున్న సినిమా ఓవర్సీస్ లో కూడా గుడ్ హోల్డ్ ని చూపిస్తుంది. దాంతో ఈ రోజు సినిమా ప్రజెంట్ బుకింగ్స్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే సినిమా మూడో రోజు వరల్డ్ వైడ్ గా 40 కోట్ల షేర్ మార్క్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉంది.
ఇక వరల్డ్ వైడ్ గా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 45 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని కూడా అందుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక డే ఎండ్ అయ్యే టైంకి సినిమా ఇదే రేంజ్ లో జోరు చూపిస్తుందో లేక ఇంతకు మించి కలెక్షన్స్ ను సొంతం చేసుకుంటుందో డే ఎండ్ అయ్యే టైంకి బుకింగ్స్ రిపోర్ట్ ను చూసి అప్ డేట్ చేస్తాం…