సంక్రాంతికి వచ్చిన ఇతర సినిమాలతో పోల్చితే కొంచం చిన్న సినిమాగా అనిపించినా కూడా ఊహకందని ఊచకోత కోస్తూ దూసుకు పోతుంది విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) అనిల్ రావిపూడి ల సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam Movie) సినిమా….రిమార్కబుల్ ట్రెండ్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర చూపెడుతూ ఊచకోత కోస్తున్న ఈ సినిమా..
రెండో రోజు అంచనాలను అన్నీ కూడా మించి పోయే రేంజ్ లో వసూళ్ళ భీభత్సం సృష్టించింది…ఇక మూడో రోజు మరో పార్షిక హాలిడే అడ్వాంటేజ్ లభించగా ఈ రోజు మాత్రం స్క్రీన్ కౌంట్ ని కొంచం పెంచుకున్న సినిమా ఎక్స్ లెంట్ ఆక్యుపెన్సీలతో దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి…
ట్రాక్ చేసిన సెంటర్స్ లో టికెట్ సేల్స్ ఆల్ మోస్ట్ రెండో రోజుకి ఏమాత్రం తీసిపోని రేంజ్ లో భీభత్సం సృష్టిస్తూ ఉండటంతో సినిమా ఇప్పుడు మూడో రోజు ఊహకందని ఊచకోత కోయడం ఖాయంగా కనిపిస్తూ ఉంది…ప్రజెంట్ బుకింగ్స్ ట్రెండ్ ను చూస్తూ ఉంటే సినిమా తెలుగు రాష్ట్రాల్లో…
మరోసారి 14 కోట్ల రేంజ్ కి తీసిపోని షేర్ ని అందుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు అంచనాలను మించిపోతే 15 కోట్ల షేర్ ని కూడా అందుకోవడం లేదా మించి పోవడం చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి… ఇక వరల్డ్ వైడ్ గా సినిమా కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ లో….
మంచి జోరుని చూపెడుతూ ఉండటంతో వరల్డ్ వైడ్ గా మూడో రోజు 16.5-17 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం మించి పోయే ఔట్ రైట్ ఛాన్స్ కూడా సినిమా ఉందని చెప్పాలి…ఈ రేంజ్ లో ఒక నార్మల్ ఫ్యామిలీ మూవీ పెద్దగా టికెట్ హైక్స్ లేకుండా దుమ్ము లేపడం అంటే…
మామూలు విషయం కాదనే చెప్పాలి. సినిమా ఊపు చూస్తుంటే లాంగ్ రన్ లో ఊహకందని కలెక్షన్స్ రికార్డులను నమోదు చేసే అవకాశం కనిపిస్తూ ఉండగా వెంకటేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ రికార్డులను నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక సినిమా 3 రోజుల్లో సాధించే కలెక్షన్స్ ఈ అంచనాలను మించిపోతాయో లేదో చూడాలి.