మొదటి రెండు రోజుల్లో ఓవరాల్ గా మంచి కలెక్షన్స్ నే సొంతం చేసుకుని ఓవరాల్ గా 40% రేంజ్ లో రికవరీని సొంతం చేసుకున్న నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం (SARIPODHAA SANIVAARAM Movie Box Office Collections) సినిమా…మూడో రోజు వీకెండ్ అడ్వాంటేజ్ లభించడంతో…
ఇక రెచ్చిపోవడం ఖాయం అనుకున్నా కూడా సడెన్ గా ట్విస్ట్ ఇస్తూ ఊహకందని ఎదురుదెబ్బ తగిలింది. తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్లా నాన్ స్టాప్ గా వర్షాలు పడుతూ ఉండటంతో ఆ ఇంపాక్ట్ ఇప్పుడు సరిపోదా శనివారం మీద గట్టిగానే కనిపిస్తూ ఉందని చెప్పాలి ఇప్పుడు…
మొత్తం మీద ప్రస్తుతానికి మార్నింగ్ మ్యాట్నీ షోలకు బుకింగ్స్ పరంగా చూసుకుంటే రెండో రోజు లెవల్ లో కొన్ని చోట్ల, రెండో రోజు కన్నా బెటర్ గా కొన్ని చోట్ల బుకింగ్స్ ఉన్నాయి. కానీ సినిమా కి వచ్చిన టాక్ కి మూడో రోజు డబుల్ గ్రోత్ ఉంటుందని ఎక్స్ పెర్ట్ చేసినా కూడా…
ఇప్పుడు వర్షాల ఇంపాక్ట్ పడింది. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రస్తుతానికి ఉన్న బుకింగ్స్ ట్రెండ్ చూస్తూ ఉంటే ఈవినింగ్ అండ్ నైట్ షోలకు ఇదే రేంజ్ లో ట్రెండ్ సాగితే మరోసారి 3 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి..
కానీ సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా 5-6 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మిగిలిన చోట్ల బాగానే హోల్డ్ చేస్తున్న సినిమా తెలుగు రాష్ట్రాల్లో వర్షాల ఎఫెక్ట్ వలన ఆశించిన గ్రోత్ లేదు…కానీ ఈవినింగ్ అండ్ నైట్ షోలకు సినిమా…
ఎంతవరకు గ్రోత్ ని చూపెడుతుంది…ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి ఇప్పుడు. ఓవరాల్ గా చూసుకుంటే సినిమాకి వచ్చిన టాక్ కి పూర్తి న్యాయం చేసే రేంజ్ లో సినిమా ఇంకా జోరు పెంచలేదు. ఇక డే 3 బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.