బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో డీసెంట్ లెవల్ లో జోరు చూపెడుతుంది అనుకున్న యంగ్ హీరో శ్రీ విష్ణు(Sree Vishnu) నటించిన కొత్త సినిమా సింగిల్(Single Movie) మూవీ, మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడం, మరో పక్క IPL మ్యాచులు పోస్ట్ పోన్ అవ్వడం కలిసి రావడంతో జనాలు థియేటర్స్ కి ఎగబడి…
వస్తూ ఉండటంతో అనుకున్న అంచనాలను కూడా మించి పోయే రేంజ్ లో 2 రోజుల్లో మాస్ కుమ్ముడు కుమ్మేసింది. ఇక మూడో రోజున సినిమా సండే అడ్వాంటేజ్ లభించడంతో అన్ని చోట్లా మరోసారి మాస్ రచ్చ చేస్తూ ఉండగా… ఓవరాల్ గా రెండో రోజు లెవల్ లో ఓపెన్ అయిన సినిమా…
మొత్తం మీద ఈవినింగ్ అండ్ నైట్ షోల ట్రెండ్ చూస్తుంటే డే 2 మీద గ్రోత్ ని చూపించే రేంజ్ లో ట్రెండ్ ను చూపెడుతూ ఉండగా….ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే సినిమా మూడో రోజున తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 2.2-2.4 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే…
అవకాశం ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలను మించితే ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉంది. ఇక సినిమా కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లో కూడా మంచి జోరుని చూపెడుతూ ఉండటంతో వరల్డ్ వైడ్ గా ఈ రోజున…
3 కోట్ల రేంజ్ నుండి ఆ పైన షేర్ ని మరోసారి అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఓవరాల్ గా వీకెండ్ లో అనుకున్న దాని కన్నా కూడా మంచి ట్రెండ్ ను చూపించిన సినిమా ఇక టోటల్ గా 3 రోజులకు గాను సాధించే టోటల్ ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.