బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజున ఆల్ మోస్ట్ 50 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ తో కుమ్మేసిన యంగ్ హీరో శ్రీ విష్ణు(Sree Vishnu) నటించిన కొత్త సినిమా సింగిల్(Single Movie) మూవీ రెండో రోజు ఏకంగా 80 వేలకు పైగా టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని అనుకున్న అంచనాలను అన్నీ కూడా మించి పోయి మాస్ ఊచకోత కోసింది…
ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో రోజున సండే అడ్వాంటేజ్ లభించడంతో అన్ని చోట్లా అనుకున్న అంచనాలను మించి కలెక్షన్స్ పరంగా మంచి జోరుని చూపెడుతూ ఉండగా, ఆల్ మోస్ట్ ట్రాక్ చేసిన సెంటర్స్ లో సినిమా రెండో రోజుకి ఏమాత్రం తీసిపోని రేంజ్ లో..
హోల్డ్ ని మూడో రోజున చూపెడుతూ ఉండగా, కొన్ని చోట్ల డే2 కన్నా బెటర్ ట్రెండ్ కనిపిస్తుంది. ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోల టికెట్ సేల్స్ లెక్కలు కూడా బాగానే జోరు చూపెడుతూ ఉండగా మొత్తం మీద ప్రస్తుతం ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి చూస్తూ ఉంటే…
మూడో రోజున తెలుగు రాష్ట్రాల్లో సినిమా 2 కోట్ల రేంజ్ నుండి 2.2 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకునే అవకాశం ఉండగా, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు…ఈవినింగ్ అండ్ నైట్ షోల ట్రెండ్ ను బట్టి ఈ లెక్క మరింతగా పెరిగే అవకాశం ఉంది.
ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా కూడా కుమ్మేస్తూ ఉండగా ఓవర్సీస్ లో హాల్ఫ్ మిలియన్ డాలర్స్ మార్క్ వైపు పరుగులు పెడుతుంది. ఇక డే 3 ఎండ్ అయ్యే టైంకి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ అంచనాలను ఎంతవరకు మించిపోతుందో చూడాలి ఇప్పుడు.